YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

మార్కెట్ కు అనుగుణంగా కామర్స్ లో కొత్త కోర్సులు ఐటి, కామర్స్ కలిపి అద్బుతమైన డిజిటల్ కామర్స్ కు తెలంగాణ నుంచే పునాదులు

మార్కెట్ కు అనుగుణంగా కామర్స్ లో కొత్త కోర్సులు ఐటి, కామర్స్ కలిపి అద్బుతమైన డిజిటల్ కామర్స్ కు తెలంగాణ నుంచే పునాదులు

తెలంగాణ రాష్ట్రానికి ఏటా రెండువేల కోట్ల రూపాయల నష్టం.. దీనిని పూడ్చేందుకు కేంద్రం నుంచి హామీ ఉన్నా .సరైన విధానం ఇప్పటికీ రూపకల్పన జరగలేదు. డీమానిటైజేషన్ వల్ల కూడా తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ పడిపోయింది.సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ‘‘డిజిటల్ కామర్స్ – అవకాశాలు, సవాళ్లు’’ అనే అంశంపై తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం  జరిగిన మొదటి జాతీయ కామర్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో అయన ప్రసంగించారు. వర్తమాన అవసరాలు, మార్కెట్ కు అనుగుణంగా కొత్త కోర్సులను రూపోందించాలని అయన అన్నారు.  డిజిటల్ కామర్స్ ద్వారా పన్నుల విధానం సులభతరం చేయాలి. యూనివర్శిటీలలో ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతులిచ్చినా యూనివర్శిటీలు వాటిని భర్తీ చేసేందుకు ఆలస్యం చేస్తున్నాయి. కొత్త యూజీసీ మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాయని అయన అన్నారు. యూనివర్శిటీలలో మంజూరు చేసిన 1061 పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలి. కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ ప్రొఫెసర్ విశ్వనాథం, కాకతీయ యూనివర్శిటీ కామర్స్ ప్రొఫెసర్ ఎ. కడియం శ్రీహరి సన్మానించారు.ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఉస్మానియా యూనివర్శిటీ వీసీ ఎస్. రామచంద్రం, పాలమూరు యూనివర్శిటీ వీసీ రాజారత్నం, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, బద్రుకా కాలేజీ ప్రిన్సిపాల్, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.  తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సావనీర్ ను మెజీషియన్ రమ్య బయటకు తీయగా ఉప ముఖ్యమంత్రి విడుదల చేశారు. మెజీషియన్ రమ్య విజ్ణప్తి మేరకు మెజీషియన్ దండం పట్టుకుని సావనీర్ ను అయన బయటకు తీస

Related Posts