YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఉత్తమ నటుడు ఇర్ఫాన్ ఖాన్, నటి విద్యాబాలన్

ఉత్తమ నటుడు ఇర్ఫాన్ ఖాన్, నటి విద్యాబాలన్

2017 సంవత్సరానికి గానూ 63వ ఫిలింఫేర్ అవార్డులను ప్రకటించింది బాలీవుడ్. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్, ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇక ఇందులో ఉత్తమ నటిగా విద్యాబాలన్(తుమ్హారీ సులు), ఉత్తమ నటుడుగా ఇర్ఫాన్ ఖాన్(హిందీ మీడియం) అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే జీవిత సాఫల్య పురష్కారాన్ని మాలా సిన్హా, బప్పీ లహరి అందుకున్నారు.

విజేతలు వీరే
ఉత్తమ చిత్రం: హిందీ మీడియం
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): రాజ్‌కుమార్ రావ్(ట్రాప్డ్)
ఉత్తమ నటి(క్రిటిక్స్): జైరా వసీమ్(సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ దర్శకుడు: అశ్విని అయ్యర్ తివారీ(బరెలీ కి బర్ఫీ)
ఉత్తమ సహాయ నటుడు: రాజ్‌కుమార్ రావ్(బరెలీ కి బర్ఫీ)
ఉత్తమ సహాయ నటి: మెహర్ విజ్(సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ స్ర్కీన్‌ప్లే: సుభాషిస్ బుతియాని(ముక్తి భవన్)
ఉత్తమ కథ: అమిత్ వి మసూర్కర్(న్యూటన్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్(జగ్గా జాసూస్)
ఉత్తమ గాయకుడు: అరిజిత్ సింగ్(రోకే నా రుకే నైనా- బద్రీనాథ్ కీ దుల్హానియా)
ఉత్తమ గాయని: మేఘనా మిశ్రా(నాచ్‌డీ ఫిరా- సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ గేయ రచయిత: అమితాబ్ భట్టాచార్య (ఉల్లు కా పత్తా- జగ్గా జాసూస్)
ఉత్తమ నేపథ్య సంగీతం: ప్రీతమ్(జగ్గా జాసూస్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిర్సా రే(ఎ డెత్ ఇన్ ద గన్జ్)
బెస్ట్ ఎడిటింగ్: నితిన్ బైడ్(ట్రాప్డ్)
ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ, ర్యూయెల్ దౌసన్ వరిన్దానీ(జగ్గా జాసూస్)

Related Posts