YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సంక్రాంతి పుంజులు చిరు వర్సెస్ బాలయ్య

సంక్రాంతి పుంజులు చిరు వర్సెస్ బాలయ్య

సంక్రాంతి పుంజులు చిరు వర్సెస్ బాలయ్య
హైద్రాబాద్, మే 20,
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పండుగలు వచ్చినా.. సంక్రాంతికుండే క్రేజే వేరు. కొత్త అల్లుళ్ళు, కోడళ్ళు, పిల్లలతో సందడి వుంటాయి తెలుగు లోగిళ్ళు. ప్రతి ఏటా సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదల అవుతుంటాయి. 2020 సంక్రాంతికి ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. రెండు సినిమాలతో భారీ వసూళ్లని సాధించారు. మరో పక్క రజనీకాంత్ దర్బార్ అంటూ కూడా మంచి సక్సెస్ ని అందుకున్నాడు. అయితే, ఈసారి కూడా స్టార్ హీరోలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారా అంటే నిజమే అంటున్నారు. ఈసారి మాత్రం సంక్రాంతి కోడిపుంజుల జోరు మామూలుగా వుండదంటున్నారు. బోయపాటి శ్రీనివాస్ బాలయ్య బాబు తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ సంక్రాంతికి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందునుంచి నందమూరి నటసింహం బాలయ్యబాబుకి సంక్రాంతి సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం. అది బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ముందుగానే డేట్స్ ని లాక్ చేసి పెట్టుకుంటారు. ప్రస్తుతం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న  ఈ మూవీ లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలై వేగంగా ముందుకు సాగనుంది. సంక్రాంతి హీరోగా ఉన్న బాలయ్య 2021 సంక్రాంతికి బోయపాటి చిత్రంతో ఖచ్చితంగా రావడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య యాక్షన్ హై రేంజ్ లో వుంటుందని, బాలయ్య నట విశ్వరూపాన్ని చూస్తారని ఫ్యాన్స్ ని బోయపాటి శ్రీనివాస్ ఊరించేస్తున్నాడు. అసలే సంక్రాంతి.. దానికి తగ్గట్టుగా బాలయ్య కోడిపుంజులా బరిలో విరవిహారం చేయడం పక్కా అంటున్నారు. ఇది చాలదన్నట్టుగా మెగాస్టార్ అభిమానులు ఖుషీగా వున్నారు. చాలా కాలం తరవాత మెగాస్టార్ చిరంజీవి కూడా ఈసారి సంక్రాంతి పండుగకి రావడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.. ఎప్పుడు మొదలు పెట్టేది క్లారిటీ లేదు. ఒకవేళ త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేసినా కూడా థియేటర్స్ వైపు. జనం వస్తారనేది చెప్పలేం.అందుకే రిస్క్ ఎందుకని సంక్రాంతికి వెళితే బాగుంటుందని భావిస్తున్నారు. సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తే వర్కవుట్ అవుతుందని డైరెక్టర్ కొరటలా శివ భావించారు. ఆచార్య పేరుతో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్నీ బాగుంటే దసరాకి టార్గెట్ చేస్కుని సినిమా వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సూచనలు కనిపించడం లేదు.ఇలా స్టార్ హీరోలు అందరూ సంక్రాంతినే టార్గెట్ చేశారు. బిజినెస్ పరంగా చూస్తే ఇదే బెటర్ అని, ఎందుకంటే అప్పటికీ పరిస్థితులు అన్నీ సద్దుమణుగుతాయి కాబట్టి కలక్షన్స్ పరంగా ఢోకా ఉండదని చెప్తున్నారు. లాక్ డౌన్లు అన్నీ సెప్టెంబర్ వరకూ వుండొచ్చంటున్నారు. మొత్తం మీద సంక్రాంతి వేడుక మామూలుగా ఉండేలా లేదు.

Related Posts