YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు విదేశీయం

డ్రాగన్ పై నివేదిక...

డ్రాగన్ పై నివేదిక...

డ్రాగన్ పై నివేదిక...
బీజింగ్, మే 22
భారత్‌తో సరిహద్దుల్లో చైనా వ్యవహరిస్తున్న తీరును విపరీత ప్రవర్తనగా అమెరికా అభివర్ణించిన విషయం తెలిసిందే. తాజాగా, దీనికి సంబంధించిన ఓ నివేదికను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ విడుదల చేసింది. చైనా చర్యలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా... భారత్‌ సహా పొరుగు దేశాలతో కవ్వింపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టింది. బలవంతపు సైనిక, పారామిలిటరీ ఆందోళనకు తెరతీస్తోందని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో చైనా దుందుడకు వైఖరి అవలంభిస్తోందని అమెరికా సీనియర్‌ దౌత్యవేత్త అలీసా వెల్స్ వ్యాఖ్యానించిన మర్నాడే ఈ నివేదిక వెలువడడం గమనార్హం.‘చైనా మాటలకు.. చేతలకు పొంతన లేదు.. దక్షిణ చైనా సముద్రం, పసుపు సముద్రం, తైవాన్‌ జలసంధి, భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాల్లో బలవంతపు సైనిక చర్యలు, రెచ్చగొట్టే కార్యకలాపాలతో పొరుగు దేశాల పట్ల దురుసు వైఖరి ప్రదర్శిస్తోంది.. ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ అక్కడి చైనా కమ్యూనిస్టు పార్టీ’(సీసీపీ) బెదిరింపులు, దురుసుస్వభావం చూపుతోంది’ అని నివేదిక వ్యాఖ్యానించింది. తమ ప్రయోజనాలను, వ్యూహాత్మక లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్న వారందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేసింది.అసమంజస విధానాల ద్వారా ప్రపంచ సమాచార సాంకేతికత వ్యవస్థను చైనా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందని నివేదిక దుయ్యబట్టింది. ‘నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ చట్టం’ ద్వారా సమాచార స్థానికీకరణను తప్పనిసరి చేసిందని, దీంతో ప్రపంచ దేశాల సమాచారాన్ని సీసీపీ తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోందని తూర్పారబట్టింది.చైనాను వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వైట్‌ హౌజ్‌ నివేదిక నొక్కి వక్కాణించింది. వ్యూహాత్మక విధానం ద్వారా ఆయా దేశాల ప్రయోజనాలను, ఉమ్మడి విలువలను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. చైనా చర్యలు, ఆ దేశాధిత నేతల బెదిరింపు ప్రకటనలు, బలప్రయోగాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని లేదా శాంతియుతంగా చర్చల ద్వరా వివాదాలను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది.ఈ మేరకు ఇప్పటికే ఏర్పడ్డ అనేక భాగస్వామ్యాలను నివేదిక గుర్తుచేసింది. ఈ నివేదికపై సంతృప్తి వ్యక్తం చేసిన పలువురు ఉన్నతాధికారులు, దీని ద్వారా చైనా పట్ల అమెరికా ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య దేశాలు, మిత్రపక్షాలతో కలిసి చైనా విసురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా స్పష్టంగా వివరించిందని తెలిపారు. ఉదాహరణకు దక్షిణ చైనా సముద్రం విషయం తీసుకుంటే చైనా ఆపరేషన్‌ వెనుక స్థిరమైన దూకుడు, నిబంధనలు, యథాతథ స్థితిని మార్చడానికి నిరంతర ప్రయత్నిస్తోందని తెలిపింది.కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా ఒక ఉపగ్రహంగా వినియోగించుకుందని ఆరోపించారు. సరిహద్దుల్లోని వివాదాలు కొన్నిసార్లు భౌతిక దాడులు, ఘర్షణలకు దారితీయడం చైనాకు కొత్తేం కాదని.. ఈ ఏడాది లడఖ్‌లో కొత్త స్థావరాన్ని ప్రారంభించడంతో భారత్‌లో ఆందోళన వ్యక్తమయ్యిందన్నారు.మే మొదటి వారంలో తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద రెండు దేశాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు బాహాబాహీకి దిగి, పరస్పరం పిడిగుద్దులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ అంశంపై ఇరు పక్షాలకు చెందిన స్థానిక కమాండర్లు సమావేశమై చర్చించడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే సమయంలో ఈ ప్రాంతానికి చేరువలోకి చైనా సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.

Related Posts

0 comments on "డ్రాగన్ పై నివేదిక..."

Leave A Comment