YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో నలుగురున్నా వీకేనా...

విశాఖలో నలుగురున్నా వీకేనా...

విశాఖలో నలుగురున్నా వీకేనా...
విశాఖపట్టణం,మే 23
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తీవ్రస్థాయిలో వెనుక బాట ప‌ట్టి.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. కొన్ని జిల్లాల్లో పార్టీ అడ్స్ కూడా గ‌ల్లంతైంది. అయిన‌ప్పటికీ.. ప్రకాశం, విశాఖ, తూర్పు గోదావ‌రి వంటి జిల్లాల్లో మాత్రం సైకిల్ అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది. న‌లుగురు చొప్పున మూడు జిల్లాల్లోనూ ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. మ‌రీ ముఖ్యంగా విశాఖ గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే.. ఇక్కడ న‌గ‌రంలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాస‌రావు స‌హా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటిచేసిన అంద‌రూ విజ‌యం సాధించారు. విశాఖ తూర్పులో వెల‌గ‌పూడి రామ‌కృష్ణ బాబు వ‌రుస‌గా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక ప‌శ్చిమ‌లో గ‌ణ‌బాబు, ద‌క్షిణంలో వాసుప‌ల్లి గణేష్ కుమార్ వ‌రుస విజ‌యాలు సాధించారు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఓడిపోయినా.. విశాఖ‌లో ప‌ట్టు నిలుపుకోవ‌డంతో చంద్రబాబుకు కొంత ఊర‌ట క‌లిగింద‌నే చెప్పారు. మ‌రి ఇలాంటి న‌గ‌రంలో ఆ న‌లుగురు పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలి? పార్టీని ఏ విధంగా బ‌లోపేతం చేయాలి ? అనే ప్రశ్నలు తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. చాలా వ్యూహాత్మకంగా ప‌నిచేయాలని… అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టాల‌న్న స‌మాధానం వ‌స్తుంది. అయితే, దీనికి భిన్నంగా ఆ న‌లుగురు వ్యవ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీకి సిటీలో మంచి ప‌ట్టుంది. ఈ ప‌ట్టును నిల‌బెట్టుకుంటూనే మ‌రింత‌గా పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునేలా ముందుకు సాగాలి.అయితే, గంటా శ్రీనివాస‌రావు కానీ, గ‌ణ‌బాబు కానీ, వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబుకానీ, వాసుప‌ల్లి గ‌ణేష్‌ల మధ్య మాత్రం ఏమాత్రం పొస‌గ‌డం లేదు. ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్నవిధంగా రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రెహ‌మాన్ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక గాజువాక మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావు అదే రూట్లో ఉన్నార‌ని అంటున్నారు. ఇక య‌ల‌మంచిలి మాజీ ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు కూడా టీడీపీకి రాజీనామా చేసేశారు. ఇక పార్టీకి ఉన్న న‌లుగురు ఎమ్మెల్యేల్లో గంటా గ‌త యేడాది కాలంగా క్వారంటైన్‌లో ఉంటున్నార‌న్న సెటైర్లు ఉన్నాయి. ఇక గ‌ణ‌బాబు పార్టీపై అసంతృప్తితో ఉండ‌డంతో పాటు ప్రభుత్వంపై ప్రశంస‌లు కురిపిస్తున్నారు.ఇక వెల‌గ‌పూడిది స‌ప‌రేటు రూటు. దీంతో టీడీపీ ఇక్కడ స‌త్తా చాట‌లేక‌పోతోంద‌నే విమ‌ర్శలు సీనియ‌ర్ల నుంచి వినిపిస్తున్నాయి. నేత‌ల మ‌ధ్య ఐక‌మ‌త్యం లేక పోవ‌డంతో .. ఇక్కడ పార్టీ అవ‌కాశం కోల్పోతోంది. జీవీఎంసీ ఎన్నిక‌ల్లో వైసీపీకి అవ‌కాశం ఏర్పడుతోంది. రూర‌ల్‌లోనూ టీడీపీ ప‌ట్టు త‌ప్పింది. మంచి బ‌లం ఉన్నప్ప‌టికీ.. ప‌ట్టించుకోవ‌డం లేదు. పార్టీ వ్యూహాన్ని ప‌క్కన పెట్టి.. అయ్యన్న వంటి నాయ‌కులు ఇష్టానుసారంగా వ్యవ‌హ‌రిస్తున్నారనే టాక్ ఉంది.మొత్తంగా చూస్తే.. న‌లుగురు కీల‌క నాయ‌కులు సీనియ‌ర్లు ఉన్నప్ప‌టికీ.. టీడీపీ పట్టు సాధించ‌లేక‌పోతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వైసీపీ ఇక్కడ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. మ‌రి ఇప్పటికైనా నాయకులు క‌ల‌సిక‌ట్టుగా ఉంటారో.. లేదా గ‌ణ‌బాబు ఇటీవ‌ల జ‌గ‌న్ ప్రభుత్వాన్ని కొనియాడిన‌ట్టు అంద‌రూ అదే బాట‌లో న‌డుస్తారా? చూడాలి. ఇక‌, చంద్రబాబు ఇటీవ‌ల విశాఖ రాలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్ప ఆయ‌న విశాఖ‌లో ప‌ర్యటించ‌లేదు. ఇటీవ‌ల వెళ్లాల‌ని ప్రయత్నించినా.. వివాదం అయిన విష‌యం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. విశాఖ‌లో గెలిచామ‌న్న సంతృప్తి.. పుంజుకోలేక పోతున్నామ‌న్న అసంతృప్తి ముందు క‌రిగిపోతోంది.

Related Posts