YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. షెడ్యూల్ విడుదల

జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. షెడ్యూల్ విడుదల
హైదరాబాద్‌ మే 23
రాష్ట్ర న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వాయిదా పడ్డ పది పరీక్షలను జూన్‌ 8వ తేదీ నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పది పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహించనున్నారు. జూన్‌ 8న ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌,జూన్‌ 11న ఇంగ్లీష్‌ రెండో పేపర్‌,జూన్‌ 14న గణితము మొదటి పేపర్‌,జూన్‌ 17న గణితము రెండో పేపర్‌,జూన్‌ 20న సైన్స్‌(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్‌,జూన్‌ 23న సైన్స్‌(జీవశాస్త్రం) రెండో పేపర్‌,జూన్‌ 26న సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌,జూన్‌ 29న సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌,జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌),జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ).

Related Posts