YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

తెలంగాణలో నామ్ కే వాస్త్..టెస్టులు

తెలంగాణలో నామ్ కే వాస్త్..టెస్టులు

తెలంగాణలో నామ్ కే వాస్త్..టెస్టులు
హైద్రాబాద్, మే 23,
లంగాణలో కరోనా టెస్టులు ఎక్కడ చేస్తున్నారు? రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎన్ని టెస్టులు చేశారు. రాష్ట్ర జనాభాలో టెస్టులు చేసిన శాతమెంత? దేశమంతా టెస్టులు చేసి కరోనాను కొంతమేర ఎదుర్కొనే మార్గాలను అన్వేషిస్తుంటే తెలంగాణ మాత్రం టెస్టులు చేసేందుకు ఎందుకు వెనకాడుతుంది? అసలు టెస్టులే చేయకుండా కరోనా కేసులు లెక్క ఎలా తేలుతుంది? ఇదే ఇప్పుడు కేంద్రం వేసిన ప్రశ్నలు. నాలుగు రోజుల క్రితం హైకోర్టు ఇదే తరహా ప్రశ్నలు సంధించగా.. నేడు కేంద్రం కూడా అవే ప్రశ్నలు వేసింది. మరో తెలుగు రాష్ట్రమైన ఏపీతో సహా దేశం మొత్తం ముమ్మరంగా టెస్టులు చేస్తున్నారు. తెలంగాణలో అయితే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రయివేట్ కేంద్రాలకు కూడా కరోనా పరీక్షలకు అనుమతులిచ్చారు. కానీ టెస్టులు సంఖ్య మాత్రం పెంచడం లేదుపైగా కేంద్రం అనుమతిచ్చిన ప్రైవేట్ కేంద్రాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తుంది. ఒక్క హైదరాబాద్ మినహా మిగతా రాష్ట్రమంతా ఈ టెస్టులను దాదాపుగా నిలిపివేసినట్లుగా కనిపిస్తుంది. అత్యధికంగా కేసులు నమోదైన సూర్యాపేటలో కూడా టెస్టులు చేయడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడి సామజిక వేత్తలే హైకోర్టుకెక్కారు. అందుకే హైకోర్టు చీవాట్లు పెట్టింది.మనం టెస్టుల ద్వారా వైరస్ ను వెంటాడకపోతే.. అదే మనల్ని వెంటాడుతోందని కేంద్రం తాజాగా తెలంగాణ ప్రభుత్వాన్ని సున్నితంగానే హెచ్చరించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 21 వేల టెస్టులు మాత్రమే చేశారని.. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇది చాలా తక్కువని.. ఇదే కొనసాగితే భవిష్యత్ లో జరిగే నష్టాలను ఎవరూ పూడ్చలేమని పేర్కొంది. దీనిపై తెలంగాణ సిఎస్ సోమేశ్ కుమార్ కు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ లేఖ రాశారు.జాతీయ స్థాయిలో 10 లక్షల మంది జనాభాలో 1,025 మందికి టెస్ట్ లు జరుపగా, తెలంగాణలో 546 మందికి టెస్టులు చేశారని.. అంటే దాదాపు సగం మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. విస్తృతంగా టెస్ట్ లు జరపడం ద్వారా పాజిటివ్ కేసులను ఎక్కువగా గుర్తించి, ఈ వైరస్ ను సమర్ధవంతంగా కట్టడి చేయడానికి వీలవుతుందని ప్రీతి సుడాన్ హితవు చెప్పారు.ప్రైవేట్ కేంద్రాలపై ఆంక్షలు విధించడంపై కూడా సుడాన్ తెలంగాణను ఒకవిధంగా వారించారు. కాగా నాలుగు రోజుల క్రితం హైకోర్టు కూడా ఇదే విషయంపై ఘాటుగా స్పందించింది. కేరళను ఆదర్శంగా తీసుకొని కరోనాను ఎదుర్కోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హితవు పలికారు. రోజుల వ్యవధిలోనే కేంద్రం స్పందించి పలు సూచనలు చేయడం విశేషం.కాగా గత నెలరోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇదే విషయంపై గగ్గోలు పెడుతున్నాయి. కొంతమంది మేధావులు, వైద్యరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఇదే విషయంపై ప్రభుత్వానికి విజ్ఞపులు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖాతరు చేయకుండా ముందుకు వెళ్తుంది. కరోనా పాజిటివ్ వ్యక్తితో సెంకండరీ కాంటాక్ట్ ఉన్న కేసులకు సైతం పరీక్షలు నిలిపివేసింది. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో? ఎలాంటి ఫలితాలను చూడాల్సి వస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ః

Related Posts