YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

షాక్ కొడుతున్న కరెంట్ బిల్లు

షాక్ కొడుతున్న కరెంట్ బిల్లు

షాక్ కొడుతున్న కరెంట్ బిల్లు
విజయవాడ, మే 23,
కరెంటు బిల్లు తీస్తున్న సందర్భంలో తీసిన బిల్లులో ప్రీవియస్‌ రీడింగ్‌ మార్చ్‌ నెలది ఒకటి ప్రస్తుతం రీడింగ్‌ ఏప్రిల్‌ నెలది ఒకటి కలిపి అంటే మనకి రెండు నెలలు వాడిన బిల్‌ వస్తున్నది. దానివల్ల స్లాబ్‌ మారడం వల్ల ఎక్కువ బిల్‌ వస్తున్నది.కిందటి నెల లాక్‌డౌన్‌ వల్ల కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ తియ్యలేకపోయారు. మార్చ్‌లో ఎంత వచ్చిందో అంతే కట్టమన్నారు,చాలా మంది కట్టేసారు కూడా. కానీ ఇప్పుడు రెండు నెలల యూనిట్స్‌ కలిపి చూపిస్తుండడం వల్ల స్లాబ్‌ పెరిగి ఎక్కువ బిల్లు వస్తున్నది.కిందటి నెలలో కట్టినది మినహాయించి బిల్‌ వస్తున్నది. అది కూడా చాలా ఎక్కువగానే వస్తున్నది.ఇక్కడ మనం గమనించాల్సింది కిందటి నెల తీయలేదు. కనుక యూనిట్స్‌ని బ్రేక్‌ చేసి బిల్‌ వేసినపుడు మాత్రమే కరెంటు బిల్లులు తక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ శాఖ ఒకేసారి రెండు నెలలకు కరెంట్‌ బిల్‌ రీడింగ్‌ తీయడం వల్ల స్లాబ్స్‌ మారి అధిక మొత్తంలో బిల్లులు వస్తు న్నాయి.దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దాదాపు రెండు నెలలుగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితై ఉన్న దిగువ మధ్య తరగతి ప్రజలకి ఇది తీవ్ర భారమవుతుంది.గత నెల అంతకు ముందు నెల బిల్‌ ఎంత ఉంటే అంత కట్టమ న్నారు. చాలామంది ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లులు చెల్లించారు.కానీ ఇప్పుడు రెండు నెలల యూనిట్లు కలిపి గరిష్ట స్లాబు కింద ఇంత బిల్‌ వేస్తున్నారు.ఇప్పుడు ఎలక్ట్ట్రిసిటి బిల్లు తీస్తున్న సందర్భంలో తీసిన బిల్లులో ప్రీవియస్‌ రీడింగ్‌ మార్చ్‌ నెలది ఒకటి ప్రస్తుతం రీడింగ్‌ ఏప్రిల్‌ నెలది .ఒకటి కలిపి అంటే మనకి రెండు నెలలు వాడిన బిల్‌ వస్తున్నది. దానివల్ల స్లాబ్‌ మారడం వల్ల ఎక్కువ బిల్‌ వస్తున్నది.కిందటి నెల లాక్‌డౌన్‌ వల్ల కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ తియ్యలేకపోయారు. మార్చ్‌లో ఎంత వచ్చిందో అంతే కట్టమన్నారు,చాలామంది కట్టేసారు కూడా. కానీ ఇప్పుడు రెండు నెలల యూనిట్స్‌ కలిపి చూపిస్తుండడం వల్ల స్లాబ్‌ పెరిగి ఎక్కువ బిల్లు వస్తున్నది. కిందటి నెలలో కట్టినది మినహాయించి బిల్‌ వస్తున్నది.అది కూడా చాలా ఎక్కువగానే వస్తున్నది. ఇక్కడ మనం గమనించాల్సింది కిందటి నెల తీయలేదు.కనుక యూనిట్స్‌ని బ్రేక్‌ చేసి బిల్‌ వేసినపుడు మాత్రమే కరెంటు బిల్లులు తక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు.రెండు నెలలలో ఉపయోగించిన మొత్తం విద్యుత్‌ యూనిట్లను ఒకేసారి చూపడంతో బిల్లుల స్లాబ్‌ రేటు పూర్తిగా మారిపోయిసాధారణంగా ఒక నెలలో చెల్లించే బిల్లుకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా విద్యుత్‌ బిల్లు వస్తోంది.కనుక దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణ కి 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయ లుగా వస్తోంది. అంటే ఇదంతా కూడా స్లాబ్‌ పెరగడం వల్ల అని అర్థం చేసుకోవాలి.మీటర్‌ రీడింగ్‌ వ్యవధి పెరగడం కూడా కేటగిరీ మారడానికి దోహదపడింది. మే నెలలో 5వ తేదీ నుంచి 15 వరకు రీడింగ్‌ తీస్తున్నారు.ఏప్రిల్‌ నెలాఖరు వరకు పరిమితం చేయకుండా రీడింగ్‌ తీసిన తేదీ వరకు లెక్క గట్టడంతో యూనిట్ల వాడకం అమాంతం పెరిగి పోయిందని సమాచారం.అందువల్లనే విద్యుత్‌ బిల్లుల్లో తేడాలు ఉంటున్నాయి.కాబట్టి ప్రభుత్వం దీని గురించి మరోసారి సమీక్ష చేసి కరెంటు బిల్లు చెల్లింపులో ప్రజలు పడుతున్న అదనపు భారాన్ని తొలగించేందుకు కృషి చేయాలి.

Related Posts