YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 కలవరపెడున్న నకిలీ విత్తనాలు

 కలవరపెడున్న నకిలీ విత్తనాలు

 కలవరపెడున్న నకిలీ విత్తనాలు
నల్గొండ, మే 27
ఖరీఫ్‌, రబీలో అనేక ప్రైవేటు కంపెనీల విత్తనాలు సాగుచేశారు. ఖర్చు చేసి వరి విత్తనాలు కొనుగోలు చేసినా కల్తీలు కలవరపెడుతూనే ఉన్నాయి. వాటిలో 12 కిలోలు, 25 కిలోల సంచులు విక్రయించారు. ఖరీఫ్‌లో సాగుచేసే ఒక బ్రాండ్‌ కంపెనీ వరి విత్తనాలు 12 కిలోల సంచి రూ.800-850, మామూలు కంపెనీవి రూ.750 వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. రబీలో రెండు రకాల విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయి. 12 కిలోల సంచి రూ.1,000-1,200 వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తున్నారు. రైతులు మాత్రం క్వింటా ధాన్యాన్ని రూ.2,000కు అమ్మలేకపోతున్నారు. కిలో రూ.20 ధర వస్తుంది. విత్తనంగా మార్చేందుకు అయ్యే ఖర్చుతో కలిపితే కిలో రూ.30 కంటే ఎక్కువ ఉండదు. కంపెనీలు మాత్రం అదే విత్తనాన్ని కిలో రూ.80-85 వరకు విక్రయిస్తున్నారు. దీనివల్ల రైతులకు రెండింతల భారం పడుతుంది. ఎకరం విత్తనాలు కొనుగోలు చేస్తే రైతుకు వాస్తవ ధర కంటే రూ.600-650 ఆదనపు భారం పడుతుంది.రైతులకు ప్రైవేటు విత్తనాలు పరిచయం చేసి దండుకుంటున్నారు. ఒక్కసారి వేసిన విత్తనాలు మరోసారికి పనికిరావని ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా రైతులు అదే కంపెనీలు, బ్రాండుల పేరున్న విత్తనాలే కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా విత్తనాలను వారనుకున్న ధరలకే విక్రయిస్తున్నారు.  ఖరీఫ్‌లో సాగర్‌ ఆయకట్టు పరిధిలో మోటర్ల ఆధారంతో వరి సాగుచేశారు. అంటే సాగర్‌ నీరొస్తే మరో 30 వేల ఎకరాల వరకు అదనంగా సాగవుతుంది. ఎంతోకాలంగా ఖరీఫ్‌లో రైతులకు బీపీటీ 5204, ఎంటీయు 1010 రకం వరి విత్తనాలను రాయితీపై సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రకం వరి వంగడాల సాగు పూర్తిగా తగ్గిపోయింది. విత్తనాలు తెచ్చినా కొనే పరిస్థితి లేదు. నీరు విడుదల చేస్తే రెండు లక్షల ఎకరాలలో వరిసాగు కానుంది. దీనిలో సుమారు లక్ష ఎకరాలలో ప్రైవేటు కంపెనీల విత్తనాలు వాడుతున్నారు. సన్నరకాలలో సాంబమసూరి ఒక్క రకానికే ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. నూతనంగా పరిచయమైన పూజ, హెచ్‌ఎంటీ, చింటూ రకాలు ప్రైవేటు కంపెనీలవే. వీటికి ఏ రాయితీ లేదు. ఈ విత్తనాలు రైతులు సొంతంగా ఆయా కంపెనీలు నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అందుకే రైతులకు కల్తీ భయం, ధరాభారం తప్పడంలేదు.గరిడేపల్లి మండలంలో గారకుంటతండా, పొనుగోడు, ఎల్బీనగర్‌లో నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ మండలాలలో కల్తీ విత్తనాలు సాగుచేశారు. పంట చేతికి వచ్చే వరకు కల్తీ విషయం తెలియకపోవడంతో ముందస్తుగా ఏమీ చేయలేకపోతున్నారు. విత్తనాలు కల్తీ అయ్యాయని తెలిసినా రైతులు పరిహారం పొందలేకపోతున్నారు. డీలర్లు, స్థానిక అధికారులు రైతులతో మాట్లాడి సెటిల్‌మెంట్‌ చేస్తున్నారు. కల్తీ విత్తనాలు వచ్చినట్లు రుజువు చేయడానికి పంట కోయకుండా ఆపాలి. కంపెనీల ప్రతినిధులు, అధికారులు వచ్చి పరిశీలించి, విత్తనాల ప్రయోగాలు పూర్తయ్యే సరికి నెలలు పట్టవచ్చు. అందుకే పదోపరకో అంటూ ఇచ్చింది తీసుకుని సర్దుకుపోతున్నారు. మిర్యాలగూడ మండలంలో కల్తీ విత్తనాలు సరఫరా చేసిన ఏజెన్సీ, రైతులతో మాట్లాడి ఎకరానికి అయిదు బస్తాలు పరిహారం ఇప్పించారు. గతేడాది ఎల్బీనగర్‌లో రెండు రకాల విత్తనాలు కల్తీ వచ్చాయి. అపుడు ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు నానాతంటాలు పడ్డారు. ఈ తంతు ఎంతోకాలంగా జరుగుతున్నా అధికారులు నివారించలేకపోతున్నారు.
 

Related Posts