YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మార్కెట్లో నకిలీ విత్తనాలు హల్ చల్

మార్కెట్లో నకిలీ విత్తనాలు హల్ చల్

మార్కెట్లో నకిలీ విత్తనాలు హల్ చల్
కర్నూలు మే 28, 
ఖరీఫ్‌ ముంచుకొస్తున్న తరుణంలో నకిలీ పత్తి విత్తనాల బెడద రైతులను కలవరపరుస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తుండటంతో నకిలీ బీటీ పత్తి విత్తనాల బెడద అధికమైంది. ఇటీవల ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తాజాగా పత్తికొండ మండలం కనకదిన్నెలో నాలుగు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోనే కాకుండా.. గుంటూరు, ఒంగోలు జిల్లాలకూ ఈ నకిలీలు తరలివెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.నకిలీ విత్తనాలపై రైతులకు అనుమానం రాకుండా పేరొందిన కంపెనీలు, వాటి విత్తన రకాల పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో విక్రయిస్తున్నారు.గత ఏడాది జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. నకిలీల కారణంగా మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాయ రాకపోవడంతో రైతులు పంట నష్టపోయారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో దాదాపు 5వేల హెక్టార్లలో పంటలు దెబ్బతినడం గమనార్హం. ఈ నకిలీ వ్యాపారంలో కొందరు టీడీపీ నేతలు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మొత్తం మీద పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, గులాబి రంగు పురుగు బెడద తగ్గడం.. ధరలు కూడా మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది పత్తి భారీగా సాగయ్యే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం 2.05 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కావచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం జిల్లాకు వివిధ కంపెనీలకు చెందిన 10.15 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు కేటాయించింది. అయితే ఇంతవరకు బీటీ విత్తన ప్యాకెట్లు పొజిషన్‌ కాలేదు. . కర్నూలు సబ్‌ డివిజన్‌తో పాటు ఆదోని డివిజన్‌లోని దాదాపు ప్రతి గ్రామంలో నకిలీ విత్తన వ్యాపారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుని విక్రయించుకోవచ్చు. కానీ కొందరు అక్రమార్కులు పత్తి జిన్నింగ్‌ మిల్లుల నుంచి విత్తనాలు సేకరించి ప్రాసెసింగ్‌ చేసే రంగులు అద్ది, అందగా ప్యాక్‌ చేసి బీటీ–2 పేర్లతో మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా కూడా నకిలీ బీటీ విత్తనాలు ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు సమాచారం.ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తున్నా నకిలీ విత్తనాలపై ఇటు వ్యవసాయ శాఖ, అటు విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించడం లేదు. గత ఏడాది జనవరి నెల నుంచే నకిలీ బీటీ విత్తనాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. ఈసారి తనిఖీలు కొరవడ్డాయి. నిఘా లేకపోవడంతో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను తరలిస్తున్నారు

Related Posts