YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

అడ్డూ, అదుపు లేకుండా ఇసుక

అడ్డూ, అదుపు లేకుండా ఇసుక

అడ్డూ, అదుపు లేకుండా ఇసుక
ఖమ్మం, మే 29
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఇసుక రవాణా అతి పెద్ద వ్యాపారంగా మారింది. ఇసుక అక్రమ రవాణాతో వ్యాపారులు పైరవీకారుల అవతారమెత్తారు. మండలాధికారులతో నిత్యం ఆర్థిక లావాదేవీలు నడుపుతుండడంతో వీరు చెప్పిందే మండల స్థాయి అధికారులు వినాల్సి వస్తుంది. ఇటీవల ఓ రైతు వ్యవహారానికి సంబంధించి స్థానిక శాసన సభ్యుడు మండలాధికారికి ఫోన్ చేసి చెప్పినా పని కాకపోవడంతో సదరు రైతు ఇసుక అక్రమ రవాణా దారుని ఆశ్రయించాడు. అతను ఫోన్‌లో చెబితేనే పని నిమిషాల్లో జరిగిపోయిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు సైతం ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇసుక పైరవీకారులు ఏం చెబితే అది చేస్తున్నారు. మొత్తం ఇసుక రవాణా ఒక పెద్ద వ్యవస్థగా మారింది.దీంతో పాటే దందాలు, మఫీయా సంస్కృతి కూడా క్రమేపి పెరుగుతూ వస్తుంది. ఇసుక రవాణా చేసే వ్యక్తులు అధికారులకు ఆత్మీయులుగా మారిపోయారుడబ్బులతో కూడుకున్న వీరి బంధం పెనవేసుకు పోయింది. ప్రతి మండలంలోనూ ఇసుకే వ్యాపారంగా దీనికి సంబంధించిన పైరవీలే ఆధారంగా ధనార్జన చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గోదావరి, కిన్నెరసాని, వైరా, మున్నేరు, కట్టలేరు ఇంకా ఇతర చిన్న నదులతో పాటు వాగుల్లో సైతం ఇసుక మిగలనీవ్వడం లేదు. అధికారులు ఇసుక ర్యాంపుల అధికారిక కేటాయింపు ఇంకా ఏదో ఏదో అంటూ ఏం చెప్పినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొందరు ఒక కూపన్ తీసుకుని 20 ట్రిప్పుల పైబడి రవాణా చేస్తున్నారు. పట్టుబడితే కూపన్ చూపుతున్నారు. లేదంటే ఎన్నిసార్లయినా ఇక వారిష్టమే. నిర్మాణ రంగం ఇటీవల కాస్త వేగం పుంజుకోవడంతో ఇసుక విలువ పెరిగిపోయింది. ఓ ట్రాక్టర్ ట్రక్కు ఇసుక ఐదారు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తుంది. రోజుకు ఒక్క ట్రిప్పు ఇసుక రవాణా చేసిన మూడు నుంచి నాలుగువేలు మిగులుతుండడంతో ఇది ఇప్పుడు ప్రధాన వ్యాపారమైంది. అనుమతులు లేని చోట సైతం తవ్వకాలు సాగిస్తున్నారు. నది పరివాహాక ప్రాంతమంతా ఎక్కడ చూసినా ఇసుక ర్యాంపులుగా మారిపోతున్నాయి. ఇసుక అక్రమ రవాణా మొత్తం రెవిన్యూ, పోలీస్ అధికారుల పరోక్ష అనుమతులతోనే సాగుతుందనేది ప్రధాన ఆరోపణ. పలు చోట్ల పైరవీకారులు స్థానిక అధికారులను ప్రసన్నం చేసుకుని ఇసుకను నగరాలకు, పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని చోట్ల నెల వారి మామూళ్లు వసూళ్లు చేస్తుండగా కొన్ని చోట్ల ఇసుక ట్రిప్పుల లెక్కన వసూలు చేస్తున్నారు. కొందరు నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి ట్రాక్టర్ల వారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నెలనెల మామూళ్లు అందుతుండడంతో అధికారులు నోరు మెదపడం లేదు. నదులు లోయలుగా మారిపోతున్నాయి. మిట్టపల్లి ఏటి నుంచి వేలాది ట్రిప్పుల ఇసుక తోలడంతో ఇప్పుడు అది గుంటలమయంగా మారిపోయింది. ఏ అధికారి వెళ్లి చూసినా ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనపడుతుంది. కొన్ని చోట్ల 10 నుంచి 20 అడుగుల లోతు ఉన్న ఇసుకను కూడా వెలికి తీశారు. వైరా నది పరివాహాక ప్రాంతంలోనూ, కిన్నెరసాని ఇతర ఏర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.రానున్న కాలంలో ఇది మరింత ప్రమాదకంగా తయారు కానుంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

Related Posts