YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఎవరీ రాధ

ఎవరీ రాధ

ఎవరీ రాధ
రాధ,రాధిక,రాధారాణి,రాధికారాణి అని పిలువబడే ఈమె శ్రీకృష్ణుని బాల్య స్నేహితురాలు. ఈమె ప్రస్తావన భాగవతం లోనూ, జయదేవుని ‘గీత  గోవిందం’లోనూ ఎక్కువగా కనపడుతుంది. రాధ ఒక శక్తి స్వరూపిణి. అందుకే శ్రీ కృష్ణ భక్తులు రాధా కృష్ణులను విడదీసి చూడలేరు. భాగవతంలో ఈమె ఒక గోపికగా చెప్పబడింది.శ్రీ కృష్ణుడు బృందావనాన్ని వదలి వెళ్ళే సమయానికి రాధ వయసు కృషుని వయసుకన్నా పదేళ్ళు తక్కువ.అయితే రాధ శ్రీకృష్ణుని కన్నాపెద్దదని చెప్పటానికి ఒక వింత కథ ప్రచారంలో ​ఉంది. ఆ కథను కూడా పరిశీలిద్దాం. 
        రాధ ఒక ​గుడ్డి పిల్లగా జన్మించినదని ప్రచారంలో ​ఉంది. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవిని కొన్ని కారణాల వల్ల తన కన్నా ముందుగా జన్మించమని కోరాడు.  లక్ష్మీదేవి, శ్రీహరి కన్నా ముందుగా జన్మించటానికి సున్నితంగా తిరస్కరించింది. శ్రీహరి పలుమార్లు విన్నవించు కోగా, ఒక షరతుపై, ఆమె అందుకు అంగీకరించింది. శ్రీ కృష్ణుణ్ణి చూసే వరకూ, కనులు తెరవనని చెప్పింది. అదీ ఆ షరతు. శ్రీహరి అందుకు అంగీకరించాడు.
          ఒక పాప పెద్ద కమలంలో, యమునా నదిలో తేలుతుంది. ఒక రోజున విషభానుడు అనే యాదవుడు కమలంలో ​ఉన్న పాపను చూసి, సంతోషపడి, ఆ చిన్ని పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. భార్యాభర్తలు ఆ చిన్నారికి ‘రాధ’ అని పేరు పెట్టి ముద్దుగా పెంచు కుంటున్నారు. ఆ చిన్నారి కన్నులు తెరచి చూడక పోవటం, తల్లితండ్రులు గమనించారు. తల్లి తండ్రులు, ఆ పాపకు దృష్టి రావాలని మొక్కని దేవుడు లేడు. అలా రోజులు గడుస్తున్నాయి. 
          రాధకు అయిదు సంవత్సరముల వయసు వచ్చింది. ఆ సమయంలో శ్రీ నారద మహర్షి ఒకరోజు వారి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ నారద మహర్షిని ప్రార్ధించి, పరిష్కార మార్గాన్ని సూచించమని వేడుకున్నారు. కారణం తెలిసిన నారద మహర్షి, ఆ దంపతులకు—-యశోదా, నందులను, బలరామ, కృష్ణులను, పాపను చూడటానికి, వారి ఇంటికి ఆహ్వానించమని చెప్పాడు.
        భార్యాభర్తలు అలానే చేశారు.    అతిథులు వచ్చారు. శ్రీ కృష్ణుడు సమీపించగానే, రాధ వెంటనే కళ్ళు తెరచి చూసింది. అలా,భూమి మీదకు వచ్చిన తరువాత రాధ చూసిన మొదటి వ్యక్తి ‘ *పరమాత్ముడు’* అయిన శ్రీకృష్ణుడు. వైష్ణవ సాంప్రదాయంలో రాధను ఒక శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. శ్రీ చైతన్యుడు తనను రాధగా ఊహించుకుంటాడు. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు, వేదమయుడైన నారాయుణిడి మొదటి వ్యక్త రూపము. తేజో మయులగు వాని నాలుగు ముఖములకు నేపధ్యములు- సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరిద్ధులు.ఆ ముఖము లందలి తేజస్సులే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు.  వీరు బ్రహ్మ గారి తర్వాత, పరమపురుషుని సద్గుణములతో వచ్చిన అవతార మూర్తులు. పైన చెప్పిన వారందరి పేర్లు ఎక్కడో , ఎప్పుడో ఒకసారి వినే ​ఉంటారు, ఒక్క సనత్సుజాతుని పేరు తప్ప. సనత్సుజాతుల వారు ‘ *శతగోప* ’ అనే పేరుతొ గోకులంలో సంచరించారు.రాధాదేవిని పెంచిన తండ్రి వీరు. వీరు మానవదేహ రూపమున ‘ *శతగోప* ’ నామ దేయమున సంచరించుచూ,దివ్యశరీరముచే సనత్సుజాతునిగా హిమాలయ ప్రాంతాలలో తపోదీక్షలో కూడా ​ఉండేవారు. విదురుడు వీరివద్ద బ్రహ్మజ్ఞానం పొందాడు.  ఈ గాధ ఎక్కువ ప్రచారంలో ఉంది. ‘ *ప్రేమ* ’ అనే స్థితి ఇప్పటి వరకు శ్రీమతి రాధాదేవికి,  చైతన్య మహా ప్రభుకు, శ్రీ రామకృష్ణునకు మాత్రమే అందిన పరమోత్కృష్ట దివ్య స్థితి.    ఈ స్థితిని సామాన్య జీవులు ఏనాటికీ అందుకొనలేరు. 
      బృందా వనం​ ​దివ్య చైతన్యముతో నిండిన పరమోత్కృష్ట ప్రేమమయ లోకం. మానవ ఊహకు అందని అత్యంత పవిత్ర ప్రేమమయ దివ్యభూమి​ బృందావనం. రాధ, కృష్ణుని ప్రేయసి అని, ఇష్ట సఖి అని రకరకాలుగా కథలు​ ​చెబుతుంటారు​. ​​
        ​కొంతమందైతే, రాధ కృష్ణుని కన్నా పెద్దది, వరసకు మేనత్త అవుతుంది​ అని కూడా చెబుతుంటారు.అందరూ శ్రీకృష్ణుని ప్రేయసులే, ప్రియ సఖులే!  శ్రీ కృష్ణుడు మాత్రం ఈమెను ఒక పరాశక్తిగా భావిస్తాడు. రాధ, శ్రీ కృష్ణుని ప్రాణాధిస్టానదేవత, అందుచేతనే పరమాత్ముడగు శ్రీకృష్ణుడు ఆమెకు మాత్రమే అధీనుడైనాడు.  ఆమె అంశ ఎల్లవేళలయందు  శ్రీ కృష్ణుని వద్దనే ​ఉంటుంది. ఆమె లేకున్నచో శ్రీకృష్ణుడు నిలువజాలడు. 
        యమునా నది ఒడ్డున ​ఉన్న ఒక ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణుడు ’ *రాధ* ’ అను రెండు అక్షరములను ధ్యానించే వాడు. ఇది గౌడీయుల నమ్మకం ‘ *బ్రహ్మ వైవర్తం* లోకూడా ​ఉన్నదని కొందరి పండితుల అభిప్రాయం. రాధయొక్క అంశ నుండే త్రిగుణాత్మికమైన దుర్గాది దేవతులు వచ్చారని కూడా బ్రహ్మ వైవర్తంలో ​ఉన్నదని చెబుతారు. 
సేకరణ.......

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts