YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

అపరాల వైపు చూస్తున్న రైతన్న

అపరాల వైపు చూస్తున్న రైతన్న

అపరాల వైపు చూస్తున్న రైతన్న
ఒంగోలు, జూన్ 18
సాగుపై ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయాల్సిన పని లేదనే ధీమా జిల్లా రైతాంగాన్ని ఉరకలెత్తిస్తోంది. సాగు చేశామంటే వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదనే ధీమాతో రైతులు ఈ ఏడాది వరి, మిరప, అపరాల సాగుకు ముందడుగు వేస్తున్నారు.జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని పంట భూముల కౌలు ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌలు ధరలు ఎగిసిపడటానికి రైతుల్లో నెలకొన్న పోటీనే అని పలువురు రైతులు వ్యాక్యానిస్తున్నారు. ఈ విషయం రైతుల్లో ఆనందాన్ని ఇస్తున్నా కౌలు రైతుల్లో మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయమే. అయినా ఎంత ఖర్చు చేశామో అంత పెట్టుబడితోపాటు, అధిక లాభాలు కూడా ఆర్జించవచ్చనే ధైర్యంతోనే రైతులు సాగుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో ఈ ప్రాంత వ్యవసాయ భూములకు మంచి డిమాండ్‌ పెరిగింది. అత్యధికంగా మిరప సాగు చేసే భూములకు కౌలు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో మిరపకు అనుకూలమైన భూములకు ఇప్పటికే కౌలు ధరలు నిర్ణయించుకొని, ఖజానాలు సైతం అయిపోయాయంటే భూములకు నేడు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. మాగాణి ప్రాంతంగా పేరొందిన కారంచేడులో గత ఏడాది నుంచి రైతులు మెట్ట పైర్ల వైపు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు.గతంతో పోల్చుకుంటే వరి సాగుకు కొంత డిమాండ్‌ తగ్గిందనే చెప్పాలి. గతంలో కారంచేడు మండలంలో సుమారు 40 వేల ఎకరాల సాగు భూములుంటే వీటిలో 25వేల ఎకరాల్లో వరి, 15 వేల ఎకరాల్లో మెట్టపైర్లు సాగు చేసేవారు. ప్రస్తుతం సుమారు 20 వేల ఎకరాలకు పైగా మెట్ట పైర్లు సాగు చేసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మిరప పంటకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. మిరప పంటకున్న «గిట్టుబాటు ధరలకు తోడు మిరప సాగు చేసే భూములకు కౌలు రైతులు అధిక కౌలు ఇచ్చి మరీ తీసుకుండటంతో డిమాండ్‌ పెరిగింది. ఎకరా కౌలు రూ.38 వేల నుంచి రూ.42వేలు ప్రస్తుతం కౌలు రైతులు ఏ పంట సాగు చేసుకున్నా సంబంధం లేకుండా ఎకరా కౌలు మాత్రం రూ.38వేల నుంచి రూ.42 వేలు వరకు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాగాణి సాగుకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కారణం ధాన్యానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది క్వింటా ధాన్యం పాతవి రూ.2500, కొత్తవి క్వింటా రూ.1700 వరకు ధర పలుకుతున్నాయి. అపరాలకు గిట్టుబాటు ధర  గతంలో ఎన్నడూ లేని విధంగా అపరాల ధర ఆశాజనకంగా ఉంది. దీంతో మెట్ట పైర్ల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. కారంచేడు ప్రాంతంలో మాగాణి భూముల్లో సైతం మెట్ట పైర్లు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులు కౌలుకు చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో ధరలు కూడా రెట్టింపయ్యాయి. పెద్ద రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. సన్న, చిన్నకారు రైతులు మాత్రం కౌలు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు.

Related Posts