YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

లాక్ డౌన్ నుంచి కోలుకొని పూలవ్యాపారులు

లాక్ డౌన్ నుంచి కోలుకొని పూలవ్యాపారులు

లాక్ డౌన్ నుంచి కోలుకొని పూలవ్యాపారులు
కాకినాడ, జూన్ 18
కరోనా మహమ్మారి ప్రజారోగ్యాన్ని కాకుండా ప్రత్యక్షంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో వేల ఎకరాల పూల తోటలపై కరోనా ప్రభావం పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా స్తంభించడం, కూలీలు పూల తోటలకు రాకపోవడంతో తోటల్లోనే పూలు వాడిపోయి రాలిపోతున్నాయి. వేసవిలో మల్లెపూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు పూల కోతకు ఆసక్తి చూపడంలేదు. అలాగే కనకాంబరం, లిల్లీ, చామంతి, బంతి వంటి పూలు కూడా తోటల్లోనే రాలిపోతున్నాయి. కోయకపోతే తోటలు దెబ్బతింటాయని పలువురు రైతులు వ్యయ ప్రయాసలతో వాటిని కోసి కాలువల్లో విడిచిపెడుతున్నారు. ఎకరా పూల సాగుకు లక్ష నుండి రెండు లక్షల రూపాయలు వ్యయం కావడంతో పాటు పూలసాగు చేసే భూములకు ఎకరాకు రూ.50 వేల నుండి 1.5 లక్షల వరకు కౌలు చెల్లిస్తారు. భారీ వ్యయంతో కూడిన ఈ సాగు ఇప్పుడు రైతులకు తీవ్ర మనోవేదనను మిగిల్చింది. సరిగ్గా పూల దిగుబడులు వచ్చే సమయానికి లాక్‌డౌన్ ప్రకటించడంతో పూల రైతుల ఆశలు ఆవిరయ్యాయి. అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడం, నిర్ణయించిన ముహూర్తాలు కరోనా ప్రభావంతో వాయిదా పడడంతో పూల మండపాలు నిర్మించే వ్యాపారులు కూడా ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలోనే అతి పెద్ద పూల మార్కెట్ కడియపులంకలో ఉంది. లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో గత 20 రోజులుగా వ్యాపారులు కూడ మార్కెట్‌ను తెరవకపోవడంతో పూల రైతులకు చిల్లిగవ్వ కూడ రాకుండా పోతోంది.

Related Posts