YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

యదేఛ్చగా అక్రమ మద్యం

యదేఛ్చగా అక్రమ మద్యం

యదేఛ్చగా అక్రమ మద్యం
విజయవాడ, జూన్ 18,
ఏపీలో మద్యం ధరలు భారీగా వున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ. కర్నాటకలనుంచి మద్యం దొడ్డిదారిన ఏపీ సరిహద్దులు దాటేస్తోంది. మద్యం అక్రమ అమ్మకాలు నియంత్రణ పై ఎక్సైజ్ అధికారుల కసరత్తు చేపట్టారు. సిబ్బంది కొరత కారణంగా అనుకున్న లక్ష్యం నెరవేటం లేదంటున్న అధికారులు ఆదిశగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు వెయ్యి మంది కానిస్టేబుళ్లు అవసరం అని ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ లెక్కన త్వరలో 13 వేలమంది సిబ్బంది రిక్రూట్ మెంట్ కు అవకాశం ఏర్పడనుంది. దీని ద్వారా మద్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం మామిడి తోటలో భారీగా మద్యం నిల్వలపై దాడులు చేసిన విజయవాడ అడిషనల్ ఎస్పీ సత్తిబాబు భారీగా స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుమారు రూ.2.25 కోట్లు విలువ చేసే మద్యాన్ని, లారీని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాల్సిన లారీ 10 రోజుల నుంచి మామిడి తోటలోని ఒక షెడ్‌లో నిల్వ ఉంచారు. మద్యానికి సంబంధించిన పక్కా సమాచారంతో స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ సిబ్బంది దాడి చేసింది. తెల్లవారుజామున లారీని, మద్యాన్ని సత్తిబాబు అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చెక్ పోస్టుల్లో అక్రమ మద్యం పట్టివేత కేసులు పెరుగుతున్నాయి. కడప జిల్లా వేంపల్లె పట్టణంలోనీ బస్టాండ్ వద్ద కర్ణాటకకు చెందిన 206 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు. బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తుండగా  పోలీసులు దాడులు చేశారు. తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం బాటిళ్ళను సీజ్ చేశారు. వీటి విలువ రెండులక్షల పైమాటే. ఇటు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో కర్ణాటక నుండి వస్తున్న మద్యం బాటిళ్ళను పట్టుకున్నారు బైరెడ్డిపల్లి పోలీసులు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కర్ణాటక నుండి మద్యాన్ని యూనోవా క్రిస్టర్లో తీసుకొని వస్తుండగా లక్కనపల్లి గ్రామం దగ్గర బైరెడ్డిపల్లి యస్.ఐ ముని స్వామి, సిబ్బంది పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా తొమ్మిదివేలు విలువ గల మద్యం పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ జోరుగా మద్మం రవాణా, అమ్మకాలు సాగుతున్నాయి. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటకు అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువైన మద్యాన్ని కృష్ణాజిల్లా నందిగామ మండలం పెద్దాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా ఈ మద్యం బాటిళ్ళను తరలిస్తున్నట్లు  పోలీసులకు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. పెద్దాపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చి అంబులెన్స్‌లో తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న ముగ్గరిని అరెస్టు చేసి అంబులెన్స్‌ను సీజ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Related Posts