YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

 పత్తి విత్తనాలపై  అధికారుల నిఘా

 పత్తి విత్తనాలపై  అధికారుల నిఘా

 పత్తి విత్తనాలపై  అధికారుల నిఘా
కరీంనగర్,  జూన్ 19,
హెచ్‌టీ పత్తి విత్తనాలపై ప్రభుత్వం గట్టి నిఘా ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్ మార్కెట్‌లో హెచ్‌టీ పత్తి విత్తనాలు పెద్ద మొత్తంలో విక్రయించేందుకు కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 64 వేల హెక్టార్లకుపైగా పత్తి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనాలు వేశారు. ఇందుకు కనీసం 2.70 లక్షల పత్తి ప్యాకెట్లు అవసరం అవుతుంది. కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రమైనందున 5 లక్షలకు మించి పత్తి ప్యాకెట్లు విక్రయించే అవకాశాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కరీంనగర్‌పై కన్నేసిన కొన్ని ప్రముఖ కంపెనీలు హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.. హెచ్‌టీ పత్తి విత్తనాలు విక్రయించిన వారిపైనే కాకుండా సాగు చేసిన రైతులపైనా కేసులు పెట్టాలని నిర్ణయించారు. కొన్ని కంపెనీలకు చెందిన బ్రోకర్లు గ్రామాల్లో పర్యటిస్తూ బోల్‌గార్డ్ (బీజీ)-3 విత్తనాల పేరుతో రైతులను బురిడీ కొట్టించి హెచ్‌టీ విత్తనాలను అంటగడుతున్నట్లు తెలుస్తోంది. గడ్డి మందును తట్టుకుంటుందని కొందరు గతేడాది నుంచే హెచ్‌టీ విత్తనాలు జిల్లాలో సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఏడాది కూడా ఆ రైతుల ద్వారానే ఆయా కంపెనీలు హెచ్‌టీ పత్తి విత్తనాల గురించి విస్తృత ప్రచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గ్రామాల్లో విరివిగా విక్రయించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కొన్ని కంపెనీలైతే బీజీ-2 ప్యాకెట్ల ద్వారానే వీటిని అమ్మకాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. కలుపు బాధ తప్పుతుందని భావిస్తున్న కొందరు రైతులు హెచ్‌టీ పత్తి విత్తనాల సాగుకు మొగ్గు చూపుతున్నట్లు తెసుస్తున్నది..హెచ్‌టీ విత్తనాలను పరిశీలించేందుకు గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన ప్యానెల్ కమిటీ జిల్లాలోనూ పర్యటించి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ సేకరించిన పత్తి విత్తనాలు హెచ్‌టీ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అడుగడుగునా నిఘా పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ జిల్లాలోని విత్తన డీలర్లలో సమావేశమైనపుడు నిషేధిత విత్తనాలను రైతులకు విక్రయించవద్దనీ, ఉల్లం ఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పస్తుతం పత్తి విత్తనాలు విక్రయిస్తున్న నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీలను అప్రమత్తం చేశారు. హెచ్‌టీ విత్తనాలు రైతుల చేతికి వెళ్లినా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటామనీ, అమ్మిన వారి తో పాటు కొనుగోలు చేసిన రైతులపైనా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.. అయితే పట్టుబడిన విత్తనాల్లో హెచ్‌టీ జన్యువు ఉండి ఉంటుందనే అనుమానాలు సైతం లేక పోలేదు. ఇలాంటి నిషేధిత విత్తనాలు మార్కెట్‌లోకి రా కుండా ఎంత ప్రయత్నించినా వీటిని సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్న నేపథ్యంలో ఏదో రూపంలో మార్కెట్లోకి వస్తున్నట్లు తెలుస్తోం ది. నిజానికి గతేడాది నుంచే ఉమ్మడి జిల్లాలో హెచ్‌టీ పత్తి విత్తనాలు సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి (హ), రామడుగు, గంగాధర, వీణవంక, హుజూరాబాద్ తదితర మండలాల్లో మూడు వేల ఎకరాలకుపైగా గతేడాది హెచ్‌టీ విత్తనాలు సాగు చేసినట్లు సమాచారం. గడ్డి నివారణ మందును తట్టుకుంటున్న నేపథ్యంలో కలుపు కూలీల బాధ తప్పుతుందని కొందరు రైతులు ఈసారి కూడా ఇవే విత్తనాలు సాగు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూల్, మహబూబ్‌నగర్ కేంద్రంగా ఉన్న కొన్ని సీడ్ ప్రాసెస్ కంపెనీల్లోనూ వీటిని రూపొందిస్తున్నట్లు ప్రభు త్వం దృష్టికి వచ్చింది. మన దేశంలో ైగ్లెఫొసెట్ గడ్డి మందును కేవలం తేయాకు తోటల్లో మాత్రమే వాడేందుకు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు పత్తి సాగులోనూ వినియోగించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి అనుమతులు వస్తాయని భావించిన కొన్ని కంపెనీలు ముందుగానే హెచ్‌టీ విత్తనాలను తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే గడ్డి మందును తట్టుకునే జీన్స్ కలిగి ఉన్న ఈ పత్తి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నట్టు గుర్తించిన జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రూవల్ కమిటీ (జీఈఏసీ) ఈ విత్తనాలకు అనుమతించ లేదు. 

Related Posts