YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 హైద్రాబాద్ లో వ్యాపారుల స్వచ్చంద లాక్ డౌన్

 హైద్రాబాద్ లో వ్యాపారుల స్వచ్చంద లాక్ డౌన్

 హైద్రాబాద్ లో వ్యాపారుల స్వచ్చంద లాక్ డౌన్
హైద్రాబాద్, జూన్ 19
తెలంగాణలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజే ఏకంగా 352 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6 వేలు దాటింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 302 ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్‌ జిల్లాలో 10, మంచిర్యాలలో 4, జనగామ, వరంగల్‌ అర్బన్‌లో 3, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేసులు వెలుగుచూడడంతో వ్యాపారస్తులు కూడా ముందస్తు జాగ్రత్తలకు దిగారు. హైదరాబాద్‌లో స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు వ్యాపారస్తులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే షాపులు తెర‌వాల‌ని మార్కెట్ అసోసియేష‌న్ తీర్మానం చేయడం చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ లో భారీగా వ్యాపారం జరిగే బేగం బజార్, ఫిల్‌ఖనా, సిద్ధి అంబర్ బజార్ సాయంత్రం 3 గంటల వరకే తెరిచి వుంచుతున్నారు.బేగంబజార్‌ హైదరాబాదీయులకే కాదు తెలుగు రాష్ట్రాల వారికి కూడా పరిచయమయిన పేరు. ఏ వస్తువైనా చౌకగా లభిస్తుండటంతో చిన్నచిన్న వ్యాపారులంతా ఇక్కడి నుంచే కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. నిత్యం దాదాపు రూ.500 కోట్ల మేర ఇక్కడ లావాదేవీలు జరుగుతాయని అంచనా.కరోనా కారణంగా బేగంబజార్ అల్లాడిపోతోంది. ఈవైరస్‌ మహమ్మారి ఎక్కడ నుంచి ఎలా వస్తుందో తెలీక వ్యాపారస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించారు. శుక్రవారం నుంచి ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హోల్‌సేల్‌ కిరాణా దుకాణాలు తెరిచి ఉంచుతామని అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠీ తెలిపారు. కరోనా పెరుగుతుండటం తో తమ వ్యాపారస్తులంతా భయంతోనే వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.  దీంతో స్వచ్ఛందంగానే తాము లాక్ డౌన్ విధించుకున్నామన్నారు. లాక్ డౌన్ ప్రారంభమయిన మార్చి 22 నుంచి బేగంబజార్‌లోని నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగిలినవన్నీ మూసేశారు. దీంతో వ్యాపారులు తీవ్రస్థాయిలో నష్టపోయారు. లాక్‌డౌన్‌లో కూడా నిత్యవసర వస్తువుల దుకాణాలను ఉద యం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు తెరిచి ఉంచారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచారు. ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువగా నిత్యావసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అద్దెకు తీసుకున్న వ్యాపారస్తులకు అద్దె డబ్బులు కూడా రావడం లేదని, అప్పుల పాలయిపోయామని వాపోతున్నారు. గుండుసూది నుంచి బంగారం, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్స్, అలంకరణ సామాగ్రి, తినుబండారాలు, సుగంధ ద్రవ్యాలు బేగంబజార్‌లో తక్కువ ధరకే దొరుకుతాయి.  నిజాం కాలంనుంచే కాదు ఏకంగా 1770 నుంచే ఇక్కడ మార్కెట్‌ కొనసాగుతోంది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో రోజూ కోట్లలో వ్యాపారం జరుగుతుంది.ఈ దుకాణాలన్నీ జనంతో నిత్యం కిటకిటలాడుతుంటాయి. కరోనా వల్గ గత మూడునెలలుగా బేగంబజార్ కళ తప్పింది. తాజా నిర్ణయానికి కిరాణా వ్యాపారులు కూడా మద్దతు తెలిపారు. కిరాణా షాపులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తెరుస్తున్నారు. అంతేకాదు కరోనా నివారణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రతి షాపులో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటుచేశారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయడంతోపాటు వినియోగదారులకు చేతి గ్లౌజులు అందించడం, వారికి శానిటైజర్లు ఇవ్వడం, భౌతిక దూరం నిబంధనలు అమలుచేయనున్నారు. 

Related Posts