YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 నెల్లూరులో సెక్స్ రాకెట్

 నెల్లూరులో సెక్స్ రాకెట్

 నెల్లూరులో సెక్స్ రాకెట్
నెల్లూరు, జూన్ 19
లాక్‌డౌన్ వేళ వ్యభిచార నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. రహస్యంగా సెక్స్ దందా నడిపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సహా పలుచోట్ల వ్యభిచార కేంద్రాలు వెలుగుచూశాయి. వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోలు పంపించి.. ఆన్‌లైన్‌లో నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తూ యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు.కావలి పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. తటవర్తి వారి వీధిలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడులు చేసి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొద్దిమొత్తంలో నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts