YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 కొనసాగుతున్న డ్రగ్స్ దందా

 కొనసాగుతున్న డ్రగ్స్ దందా

 కొనసాగుతున్న డ్రగ్స్ దందా
హైద్రాబాద్, జూన్ 22
హైదరాబాద్ నగరంలో మరో భారీ డ్రగ్స్ కేసును ఛేదించారు. ముగ్గురు ముఠా సభ్యుల దగ్గర్నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనపర్చుకున్నారు. ఎండీఎం, కొకైన్, గంజాయితో పాటుగా ఆశిష్ ఆయిల్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు. ముంబయి, గోవా, బెంగళూరు, చెన్నై నుంచి ఈ డ్రగ్స్ తెప్పిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర మెడిసిన్ పేరుతో ఈ డ్రగ్స్‌ని తీసుకు వచ్చినట్లుగా తేలింది. ప్రధానంగా నిత్యావసర సరుకులు తీసుకువచ్చే లారీలో ఉండే క్లీనర్స్ ద్వారా వీటిని హైదరాబాద్‌కు తీసుకు వచ్చారని విచారణలో బయట పడింది.ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులకు భరత్ అనే వ్యక్తి ఎప్పటినుంచో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతణ్ని పట్టుకోవడానికి ఎప్పటినుంచో అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈసారి డ్రగ్స్ సప్లయ్ చేస్తూ భరత్ నేరుగా అధికారులకు చిక్కాడు. లాక్ డౌన్ సమయంలో పెద్ద మొత్తంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. భరత్ లాక్ డౌన్ సమయంలో కూడా చాలామందికి కూడా డ్రగ్స్ విక్రయించినట్లు అధికారుల విచారణలో బయట పడింది.ముఖ్యంగా గోవా నుంచి కోకెన్, ముంబయి నుంచి ఎండీఎంఏ, చెన్నై నుంచి బ్లోటని, వైజాగ్ నుంచి గంజాయి, అదే మాదిరిగా గంజాయి ఆయిల్ లిక్విడ్ కూడా భరత్ తెప్పించినట్లుగా పోలీసులు వెల్లడించారు.

Related Posts