YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం

 ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం

 ఏపీలో కొత్త పారిశ్రామిక విధానం
గుంటూరు, జూన్ 23
నూతన పారిశ్రామిక విధానంగా కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తోంది. దీనిలో బాగంగా పది రకాల పరిశ్రమలపై ప్రధానంగా దృష్టి సారించింది. విధివిధానాలకు సంబంధించి ముసాయిదా కూడా ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. ముసాయిదా ఖరారు దిశలో పలు సూచనలు చేశారు. ప్రధానంగా దృష్టి సారిం చాలని భావిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, టెక్స్‌ టైల్స్‌, బిల్డిరగ్‌ మెటీరియల్‌, యంత్రాలు, ఫార్మా, సోలార్‌ పరికరాలు, కలప ఉత్పత్తులకు చైనాలో ఆదరణ ఉందని, అందువల్ల అక్కడ సంస్థలు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న సంస్థల ఉనికిని కాపాడుతూనే, కొత్త సంస్థలను ఆహ్వానించేలా ప్రణాళికను సిద్ధం చేయాలని సిఎస్‌ సూచించారు. పర్యావరణం, అభివృద్ధి, ఉపాథి, ప్రాంతాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. సింగపూర్‌, మలేషియాల్లో ఉన్న పారిశ్రామిక, జిడిపి వృద్ధి గణారకాలను కూడా అధ్యయనం చేసి, ఆ దిశగా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 15 లక్షల కోట్ల అంతర్జాతీయ మార్కెట్‌ను 2024 నాటికి 28 లక్షల కోట్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని పాలసీలో లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.అభివృద్ధిలో భాగంగా ఉత్తరారధ్రను జీడి క్లస్టర్‌గా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఇదే తరహాలో 13 జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి వివిధ పరిశ్రమలకు పెద్దపీట వేయాలని పాలసీలో పొరదుపరుస్తున్నారు. రానున్న మూడేళ్లలో తొమ్మిది లక్షల కొత్త ఉద్యోగాల కల్పన, 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు, 40వేల కోట్ల రూపాయల జిఎస్‌డిపి సాధన, 3,800 కోట్ల రూపాయల వరకు ఖజానాకు ఆదాయం లక్ష్యంగా పాలసీని సిద్ధం చేయనున్నారు. ఎంఎస్‌ఎంఇలను ప్రోత్సహిరచేరదుకు ప్రతి లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో ఒక నైపుణాభివృద్ధి కేంద్రాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా రెండు నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు.

Related Posts