YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి         

పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి         

పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి                       
పోచంపల్లి జూన్ 23 
గత మూడు నెలల గృహ విద్యుత్ బిల్లులు లాక్ డౌన్ పేరుతో సగటు చేయడం వల్ల స్లాబ్ మారి పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు పెరిగాయని పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఎం పోచంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని కోరుతూ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి మండల ఏఇ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ  కరోనా నెపద్యంలో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ పరిస్థితులలో  ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ చార్జీల భారాన్ని పెంచి ఇబ్బందులపాలు చేస్తుందని విమర్శించారు. 50 యూనిట్ల లోపు వాడేవారు యూనిట్కు 1.45 లు పైసలు చెల్లించేవారు. కానీ స్లాబ్ పెరగడం వల్ల రూ.2.60 లు కట్టాల్సి వస్తుంది అని డిస్కౌంట్ లో ఏ నెలకానెల రీడింగ్ తీసి బిల్లింగ్ చేయాలి కానీ మూడు నెలలు రీడింగ్ తీయకపోవడం వల్ల అదనపు భారం వినియోగదారులు భరించాల్సి వస్తుందని, డిపార్ట్మెంట్ చేసిన విధానం సవరణ వల్ల వినియోగదారులు నష్టపోతున్నారని నర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నెలవారి రీడింగ్ తీసి బిల్లింగ్ చేయాలి తప్ప సగటు బిల్డింగ్ చేసే విధానాన్ని ప్రభుత్వ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.. కరోనా నేపథ్యంలో కరువు పరిస్థితులలో ప్రజలకు, వలస కార్మికులకు చేయడానికి పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులలో పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలు చెల్లించే పరిస్థితులు లేరని ప్రభుత్వమే పెరిగిన విద్యుత్ చార్జీల భారాన్ని మొత్తం భరించాలని  తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పదిహేను వందల రూపాయలు ఆరు నెలల పాటు ఇవ్వాలని, ప్రతి నెలా ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ఇచ్చి, 17 రకాల నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఆరు నెలలు అందించాలని, కరోనా విజృంభిస్తున్న ఈ పరిస్థితులలో టెస్ట్లను విస్తృత పరచాలని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఉచిత వైద్యం అందించాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి మున్సిపల్ పట్టణ కార్యదర్శి గడ్డం వెంకటేష్ గూడూరు బుచ్చిరెడ్డి కోట రామచంద్రారెడ్డి ప్రసాదం విష్ణు జంగయ్య లాలయ్య మంచాల మధు దుబ్బాక జగన్  జ్యోతి కమలమ్మ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Related Posts