YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

మిల్లర్లతో మంత్రి ఈశ్వర్ కుమ్మక్కూ...

మిల్లర్లతో మంత్రి ఈశ్వర్ కుమ్మక్కూ...

మిల్లర్లతో మంత్రి ఈశ్వర్ కుమ్మక్కూ.....
తప్పులను కప్పి పుచ్చుకునేందుకే జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ విమర్శలు రైతుల పక్షాన పోరాడితే విమర్శిస్తారా...ధాన్యం కటింగ్ డబ్బులను రైతులకు మంత్రి, ఎమ్మెల్యే సంజయ్ లు  ఇప్పించాలి
డిసిసి అధ్యక్షులు లక్మణ్ కుమార్ డిమాండ్
జగిత్యాల  జూన్ 24
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేశారని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ  జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్లు ఏసామాజికవర్గానికి ఉన్నాయో తెలుసని, రెండు నెలలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులకు తరుగు పేరిట జరుగుతున్న అన్యాయాన్ని  ప్రశ్నించినా   టిఆర్ఎస్ నాయకులు ఏఒక్క కేంద్రాన్నైనా సందర్శించారా అని ప్రశ్నించారు.ధర్మపురి నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి , మంత్రి హోదాలో ఉన్నానని గొప్పలు చెప్పుకొంటున్న ఈశ్వర్ జగిత్యాల జిల్లాలోని18 మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన ఏఒక్క  ధాన్యం కొనుగోలు కేంద్రానికైన వెళ్ళి రైతుల సమస్యలను తెలుసుకున్నావా అని ఆయన ప్రశ్నించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ గోపాల్ రావు అనే మిల్లర్ తో మాట్లాడడం,  మంత్రి ఈశ్వర్ ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతి బ్యాగుకు 2 కిలోల తరుగు తీయాలని స్వయంగా అధికారులకు చెప్పడంచూస్తుంటే టిఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏపాటిప్రేమ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని లక్ష్మణ్ కుమార్ విమర్శించారు.ఈ సమావేశంలో టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లెపల్లి దుర్గయ్య, కౌన్సిలర్ నక్క జీవన్, నాయకులు గుంటి జగదీశ్వర్, గాజుల రాజేందర్, మ్యాదరి అశోక్, పులి రాము, అల్లాడి వెంకటేష్ ,నేహాల్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts