YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

ప్రైవేట్ ఫీజులపై పేరంట్స్ ఆందోళన

ప్రైవేట్ ఫీజులపై పేరంట్స్ ఆందోళన

ప్రైవేట్ ఫీజులపై పేరంట్స్ ఆందోళన
హైద్రాబాద్, జూన్ 24
ప్రభుత్వ జీవో ప్రకారం ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ స్కూల్ యాజమాన్యం మాత్రం పూర్తి ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపు అన్ని పాఠశాలలో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించారు. అయితే, ఈ ఆన్‌లైన్ క్లాసులు జరుపుతున్నామని, ఫీజులు చెల్లించాలంటూ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. హయత్ నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు స్కూలు యజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధించడంతో వారంతా స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అసలే లాక్ డౌన్ విధించడం వల్ల ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఇటువంటి సమయంలో రూ.వేలలో ఫీజులు ఎలా చెల్లించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఆన్‌లైన్ క్లాసుల వల్ల తమ పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ప్రభుత్వ జీవో ప్రకారం స్కూల్ యాజమాన్యానికి ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ స్కూల్ యాజమాన్యం మాత్రం పూర్తి ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం గురించి స్కూల్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడదామని వస్తే పోలీసులతో తమను అడ్డుకుంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని అలాగే ఆన్‌లైన్ క్లాసుల సమయాన్ని కూడా తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

Related Posts