YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చెన్నయ్ లో తేదీన డిఫ్ ఎక్స్పో 2018 ని ప్రారంభించనున్న ప్రధాని

చెన్నయ్ లో తేదీన డిఫ్ ఎక్స్పో 2018 ని ప్రారంభించనున్న ప్రధాని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం తమిళ నాడు లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా అయన చెన్నై లో జరిగే డిఫెన్స్ ఎక్స్పో 2018 నుని కాంచీపురం జిల్లా తిరువిడందాల్ లో ప్రారంభిస్తారు. రక్షణ వ్యవస్థలు, దాని సంబంధిత భాగాల ఎగుమతికి సంబంధించినంత వరకు దేశ శక్తియుక్తులను కళ్ళకు కట్టే విధంగా ‘‘ఇండియా: ది ఎమర్జింగ్ డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్’’అన్న ఇతివృత్తంతో ఈ కార్యక్రమం వుంటుంది. 150 కి పైగా అంతర్జాతీయ ఎగ్జిబిటర్ లతో సహా 670 కి పైగా ఎగ్జిబిటర్ లు ఈ డిఫ్ ఎక్స్పో లో పాల్గోంటున్నారు. 15 శాతం స్టాళ్లను ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి కేటాయించారు. ఈ ప్రదర్శనలో టాటా, ఎల్ & టి, కళ్యాణి, భారత్ ఫోర్జ్, మహీంద్రా, ఎమ్కెయు, డిఆర్డిఒ, హెచ్ఎఎల్, బిఇఎల్, బిడిఎల్, బిఇఎమ్ఎల్, ఎమ్డిఎల్, జిఆర్ఎస్ఇ, జిఎస్ఎల్, హెచ్ఎస్ఎల్, మిధాని, ఆయుధ కర్మాగారాలు, ఇంకా పలు ఇతర సంస్థలు భారతదేశం తరఫున పాల్గొననున్నాయి. యుఎస్ఎ కు చెందిన లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, స్వీడన్ కు చెందిన సాబ్, ఫ్రాన్స్ కు చెందిన ఎయర్ బస్, రఫేల్, రష్యా కు చెందిన రాసన్బరోన్ ఎక్స్పోర్ట్ స్, యునైటెడ్ శిప్ బిల్డింగ్, యుకె కు చెందిన బిఎఇ సిస్టమ్స్, ఇజ్రాయల్ కు చెందిన సిబాత్, ఫిన్ లాండ్ కు చెందిన వార్ట్శిలా, జర్మనీ కి చెందిన రోడే, శ్వార్జ్ లతో పాటు పలు ఇతర అంతర్జాతీయ కంపెనీలు కుడా పాల్గోంటున్నాయి. ప్రధాన మంత్రి చెన్నై లోని అడయార్ లోని కేన్సర్ ఇన్స్టిట్యూట్ ను కూడా సందర్శిస్తారు. శ్రీ పెరంబదూర్ లో వజ్రోత్సవ భవనం, పాలియేటివ్ కేర్ సెంటర్ (మహావీర్ ఆశ్రయ్), అడయార్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో డే కేర్ సెంటర్, ఇంకా నర్సుల క్వార్టర్ లను ప్రారంభిస్తారు.

Related Posts