YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కోయంబేడు టూ వైజాగ్...

కోయంబేడు టూ వైజాగ్...

కోయంబేడు టూ వైజాగ్...
నెల్లూరు, జూన్ 25
మిళనాడు లోని కోయంబేడు మార్కెట్ ఒక్క ఆ రాష్ట్రాన్ని మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది. కోయంబేడు మార్కెట్ నుంచి వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించడం కష్టం కావడంతో ఏపీలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కోయంబేడు మార్కెట్ కారణంగా పొరుగునే ఉన్న చిత్తూరు, నెల్లూరు జిల్లాలు మాత్రమే కాకుండా కర్నూలు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను భయపెడుతోంది.కోయంబేడు మార్కెట్ అతి పెద్దది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు కూరగాయలు, పళ్లు వస్తుంటాయి. అలాగే ఆంధ్రప్రాంతం నుంచి కూడా ఇక్కడకు కూరగాయలు, చేపలు వంటివి వస్తాయి. పూలు కూడా చేరతాయి. దీంతో ఏపీ రైతులకు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ తో సుదీర్ఘ అనుభవం ఉంది. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కోయంబేడు మార్కెట్ ను తెరిచారు. ఆ సమయంలోనే ఈ వ్యాధి అంటుకుంది.ఏపీలోని నెల్లూరు, విశాఖ, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోయంబేడు మార్కెట్ కు రైతులు వెళ్లారు. అక్కడ తమ వస్తువులను విక్రయించడమే కాకుండా కూరగాయాలను రాష్ట్రానికి తీసుకు వచ్చారు. వీరితో పాటు కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన లారీ డ్రైవర్లకు కూడా కరోనా సోకింది. దీంతో అప్రమత్తమయిన అధికారులు ఏపీ నుంచి కోయంబేడు మార్కెట్ కు వెళ్లివచ్చినవారిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.ఇక కోయంబేడు మార్కెట్ కారణంగా విశాఖపట్నంను కూడా వణికిస్తోంది. కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన 57 మందికి కరోనా వైరస్ సోకింది. విశాఖపట్నంలోని అప్పుఘర్, మధురవాడ, దండుబజార్, సాయిరాం కాలనీ ల్లో కోయంబేడు సెగ తగిలింది. విశాఖ జిల్లాలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణంగానే విశాఖలో కేసులు పెరుతున్నట్లు అధికారుల చెబుతున్నారు

Related Posts