YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

మెట్రోకు 150 కోట్ల లాస్

మెట్రోకు 150 కోట్ల లాస్

మెట్రోకు 150 కోట్ల లాస్
హైద్రాబాద్, జూన్ 25
లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో కరోనా వ్యాప్తితో మెట్రో సర్వీసులు నిలిచిపోవడంతో మూడు నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర ఆదాయాన్ని మెట్రో సంస్థ కోల్పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో మెట్రోరైలు జర్నీకి బ్రేకులు పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. మళ్లీ మెట్రో రైళ్లను నడిపే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోసం మెట్రో అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో మెట్రో పరుగులు తీస్తాయన్న సంకేతాలు వచ్చినా ప్రస్తుతం మెట్రోరైళ్లు పట్టాలేక్కే పరిస్థితులు కనిపించడం లేదు.లాక్‌డౌన్‌కు ముందు మెట్రో రైళ్లలో ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణం చేసేవారు. కరోనా నేపథ్యంలో మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికుల మధ్య భౌతికదూరం తప్పనిసరి అయింది. దీంతో ప్రయాణికులు తరచూ తాకే, నిల్చునే ప్రాంతాలను శానిటైజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ కరోనా విజృంభిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చే విషయంపై సందిగ్ధత నెలకొంది.ప్రస్తుతం ఎల్భీనగర్- మియాపూర్, జేబిఎస్- ఎంజిబిఎస్, నాగోల్-, రాయదుర్గం మొత్తం 69 కి.మీ మార్గంలో మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం సేకరించింది. దీనికి సొంత నిధులు కలిపి మొత్తంగా సుమారు రూ.13 వేల కోట్లను ఖర్చు చేసింది. లాక్‌డౌన్‌కు ముందు నెలకు రూ.50 నుంచి 60 కోట్ల ఆదాయం మెట్రోరైళ్ల ద్వారా వచ్చేది. ప్రస్తుతం కరోనా ఉధృతి అవుతున్న నేపథ్యంలో మెట్రో నష్టాల్లోకి కూరుకుపోయే దిశగా పయనిస్తోంది. మూడు నెలలుగా ప్రయాణికుల చార్జీలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా నిలిచిపోవడంతో మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు అధిక భారమవుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను నడిచే అవకాశాలున్నాయని మెట్రో అధికారులు భావిస్తున్నారు

Related Posts