YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

ఇక్కడ నిబంధనలు వర్తించవు

ఇక్కడ నిబంధనలు వర్తించవు

ఆడపిల్ల ఆపదలో పడింది. ఆరేళ్ల లోపు చిన్నారుల లింగ నిష్పత్తి కలవరపెడుతున్నది. కొత్త జిల్లా గణాంకాల ప్రకారం, ప్రతి వెయ్యి మంది బాలురకు కేవలం 931 మంది మాత్రమే బాలికలు ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో చూసినా ఇదే దుస్థితి కళ్లగడుతున్నది. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు భ్రూణహత్యలకు తెగబడడం వల్లే ఈ దుస్థితి దాపురించినట్లు తెలుస్తుండగా, ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జిల్లాల పునర్వ్యస్థీకరణ తర్వాత 31 జిల్లాల సమగ్ర సమాచారాన్ని రాష్ట్రసర్కారు వార క్రితమే సచిత్రంగా విడుదల చేసింది. వాటి ప్రకారం చూస్తే జిల్లాలో బాలికల నిష్పత్తి దారుణంగా ఉన్నది. ప్రతి వెయ్యి మంది బాలురకు 939మందే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత అంతరం పెరిగే ప్రమాదమున్నది.చట్ట విరుద్ధంగా స్కానింగ్‌లు చేస్తూ పుట్టబోయే బిడ్డ ఆడా, మగ అనేది తేల్చి చెప్పి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు. స్కానింగ్ సెంటర్ల పనిపట్టేందుకు అధికారులు పక్కా ప్రణాళికలను రూపొందించారు. సహజంగానే తల్లిదండ్రులకు తమకు పుట్టబోయే బిడ్డ ఆడా, మగ అనేది తెలుసుకోవాలనే కుతుహాలం ఉంటుంది. తొలి కాన్పూయితే శిశువు ఎవరనేది పెద్దగా పట్టించుకోకపోయినప్పటికి తొలిసారి ఆడ పిల్ల పుడితే మ లిసారి కాన్పూలో మగబిడ్డే కావాలనే కోరిక కాలానుగుణంగా తల్లిదండ్రులలో పెరిగిపోతుంది. దీంతో ముందస్తుగానే తమకు పుట్టబోయేబిడ్డ లింగనిర్ధారణ కొరకు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. స్కానింగ్‌లో 2వ కాన్పూలో సైతం ఆడపిల్లే పుడుతుందని తెలిస్తే బలవంతంగా గర్భవిచ్చేదనం కావిస్తున్నారని ప్రభుత్వం లింగానిర్ధారణ పరిక్షలు నిషేధించింది. అయినప్పటికి స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని రహస్యంగా స్కానింగ్‌లు చేస్తూ నిషేధాన్ని నీరుకారుస్తున్నారు.కొందరు మోబైల్ వ్యాన్లలో స్కానింగ్ నిర్వహిస్తున్నరని సమాచారం. నల్లగొండ జిల్లాలో నకిరేకల్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాలలోని కొన్ని స్కానింగ్ కేంద్రాలలో చట్టవిరుధంగా స్కానింగ్‌లు చేస్తున్నారని, గర్భ విచ్చేదనాలకు పాల్పడు తు న్నారని అధికారులకు ఫిర్యాదులందాయి. దీంతో అధికా రులు ఆయా ప్రాంతాలలో పెద్ద ఎత్తున తనిఖీలు సైతం నిర్వ హించారు. అధికారులు కళ్లుకప్పి చట్టవిరుద్ధంగా స్కా నింగ్‌లు చేయడం వలన పిండ దశలోనే ఆడపిల్లల హననం జరుగుతుందని, దీనిని సంపూర్ణంగా అరికట్టాలనే లక్షం తో అధికారులు ముందుకు సాగుతున్నారు. పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టం క్రింద చట్టవిరుద్ధంగా స్కానింగ్‌ల పాల్పడే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని జైలుకు పంపేల  అదికారులు చర్యలు చేపడుతు న్నారు.మోబైల్ స్కానింగ్ వ్యాన్‌లను గుర్తించేందుకు రహ దారులపై, చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చే యాలని  నిర్ణయించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉ ప్పల్ జిల్లా స్థాయి సమావేశంలో చట్టవిరుద్ధ స్కానింగ్‌లకు పా ల్పడే వారిపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పోలీ స్, మెడికల్, ఐసిడియస్ అధికారులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పా టు చేసి అన్ని స్కానింగ్ కేంద్రాలు, నర్సింగ్ హోమ్ లలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గతంలో అబార్షన్ చేయించుకున్న వారిని గుర్తించి వారు ఎక్కడ స్కానింగ్ చేయించుకున్నారు, ఎవరు అబార్షన్ చేశారు అనే వివరాలు సేకరించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సమయత్తమైంది. క్లినిక్ డాక్టర్లు, యజమానులు మొదటి నేరానికి 10వేల రూ పాయల వరకు జరిమానతో పాటు మూడు సంవత్సరాల జైలుశిక్ష, తిరిగి నేరం చేస్తే రూ.50 వేల జరిమానతో పాటు 5 ఏళ్ళ జైలుశిక్ష విధించటంతో పాటు వైద్యుని యెక్క మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.  పిండం లింగనిర్దారణ సామర్దం కలిగిన అల్ట్రాసౌండ్ మిషన్, స్కానర్, ఏ ఇతర పరికరాన్ని రిజిస్ట్రేషన్ లేకుండా ఉపయోగిస్తున్నా అట్టి మిషన్లను జప్తుచేసి సెక్షన్ 23 క్రింద కేసునమోదు చేస్తారు. డయాగ్నస్టిక్ సెంటర్లు, పరీక్షలు నిర్వహంచే వైద్యులు, గర్బీణీకి మద్యవర్తిత్వం వహించేవారు, గర్బీణీ భర్త, బంధు వులపై కూడ చర్యలు చేపటేందుకు అధికారులు సిద్దమ య్యారు. 

Related Posts