YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 తెలంగాణ సోనా కొత్త రకం బియ్యం

 తెలంగాణ సోనా కొత్త రకం బియ్యం

 తెలంగాణ సోనా కొత్త రకం బియ్యం
హైద్రాబాద్, జూన్ 29, 
కేవలం 100 రోజుల్లో పంట పండే అద్బుతమైన వంగడం తెలంగాణ శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకొచ్చారు. ధాన్య భాండాగారంగా గుర్తింపు పొందిన రాష్ట్రంగా తెలంగాణ పేరు పొందిన సంగతి తెలిసిందే. స్వల్ప కాలంలోనే పంట దిగుబడి వచ్చే సన్నరకం ధాన్యం పేరు తెలంగాణ సోనాగా పేరు పెట్టారు.ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ వరి రకాన్ని రూపొందించారు. సాంబమసూరి కన్నా సన్నరకమే కాక.. దానికంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇస్తుందంటున్నారు. ఎంటీయూ– 1010 రకాన్ని ఆడమొక్కగా, జేజీఎల్‌–3855 (కరీంనగర్‌ సాంబ) రకాన్ని మగమొక్కగా సంకరం చేసి రూపొందించారు.ఇందులో పిండి పదార్థాలు కూడా చాలా తక్కువని తేలింది. అందుకే దీన్ని ‘షుగర్‌ ఫ్రీ రైస్‌’ అని అంటున్నారు. ప్రస్తుతం వానాకాలం స్టార్ట్ కావడంతో..రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రచిస్తోంది.మే ఆఖరి వారంలో నాటువేస్తే 150 రోజులు..జూన్‌ మొదటి, రెండో వారాల్లో నారుపోస్తే 130–140 రోజులు..జూలై రెండో వారం తరవాత నారుపోస్తే 120 రోజుల్లో, ఆగస్ట్‌లో పోస్తే 100 రోజుల్లోనే పంట చేతికొస్తుందని వెల్లడిస్తున్నారు. సాంబమసూరి (బీపీటీ–5204) స్థానంలో దీన్ని సాగుచేయవచ్చని, దీన్ని చౌడు నేలల్లో సాగు చేయకూడదని సూచిస్తున్నారు. తెలంగాణ రైతన్నను ఈ వానాకాలం నుంచే ‘తెలంగాణ సోనా’సాగు దిశగా ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ మార్పులు, చీడ పీడలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరిలో మధ్య, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందిస్తున్నారు. 

Related Posts