YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

9 గ్రామాల్లో మద్య నిషేధం

 9 గ్రామాల్లో మద్య నిషేధం

. 9 గ్రామాల్లో మద్య నిషేధం
మెదక్, జూన్ 29
బెల్టు షాపుల ఏర్పాటుతో రేయింబవళ్లు మద్యం దొరుకుతోంది. మద్యం తాగినవారు ఇతరులతో ఘర్షణ పడటం     సర్వసాధారణంగా మారింది. ఇక తాగినవారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. విసుగు చెందిన గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. మద్యం విక్రయాలు నిషేధించాలని తీర్మానం చేశారు. పదేళ్లుగా మద్య నిషేధం కొనసాగుతుండటంతో వారు ఆశించిన ఫలితాలు సాధించారు. గ్రామాల్లో గొడవలు తగ్గాయి. గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. మందాపూర్ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.30 వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. తీర్మానం ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించారు. ఆ డబ్బును పంచాయతీ ఖాతాలో జమచేశారు. ఇక చేవెళ్ల గ్రామంలో కూడా మద్యం వికయ్రించిన వ్యక్తికి రూ.10 వేలు జరిమాన విధించారు. దీంతో మద్యం విక్రయాలు తగ్గాయి. రాంపూర్, వెంకటరావుపేట, ముప్పారం, అప్పాజిపల్లి, రెడ్డిపల్లి, సీతానగర్‌లో మద్యం విక్రయాలపై నిషేధం కొనసాగుతోంది.  అల్లాదుర్గం మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది పంచాయతీలలో మద్యం అమ్మకాల నిషేధం అమలు చేస్తున్నారు. పదేళ్లుగా గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతోంది. మండల పరిధిలోని కాయిదంపల్లి, రాంపూర్, సీతానగర్, రెడ్డిపల్లి, వెంకట్‌రావుపేట, చేవెళ్ల, ము ప్పారం, అప్పాజిపల్లి, మందాపూర్‌ గ్రామాలలో మద్యం విక్రయాలను నిషేధించారు.  మండలంలో మద్య నిషేధం అమలు చేసిన మొదటి గ్రామం కాయిదంపల్లి. ఈ గ్రామంలో మద్యం అమ్మకాలతో గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. దీంతో వీరి కుటుంబాలు వీధులపాలవుతున్నాయి. అంతేకాకుండా మద్య ం మత్తులో ఇతరులతో ఘర్షణ పడేవారు. గమనించిన గ్రామ పెద్దలు, నాటి సర్పంచ్‌ సంగమేశ్వర్‌ 2008లో బెల్ట్‌ షాపుల  రద్దతోపాటు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే రూ.5 వేల జరిమానా విధించాలని నిబంధనలు రూపొందించి తీర్మానంపై సంతకాలు చేశారు. గత 12 ఏళ్లుగా గ్రామంలో మద్య నిషేధం అమలు చేస్తున్నారు. నిషేధానికి గ్రామస్తులు కట్టుబడి ఉండటం చెప్పుకోదగ్గ విశేషం.

Related Posts