YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

 19.42 క్వింటాళ్ల ధాన్యం దోచుకున్నారని ఓ రైతు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

 19.42 క్వింటాళ్ల ధాన్యం దోచుకున్నారని ఓ రైతు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

 19.42 క్వింటాళ్ల ధాన్యం దోచుకున్నారని ఓ రైతు
జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు
జగిత్యాల జూన్ 30
తను విక్రయించిన వరిధాన్యంలో 19.42 క్వింటాళ్ల ధాన్యం (విలువ రూ.35,635) దోచుకున్నారని, న్యాయం చేసి ఆదుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ గోగులోత్ రవికి  ఓ రైతు సోమవారం ఫిర్యాదు చేశారు.రైతు తెలిపిన వివరాల ప్రకారంగా  బుగ్గారం గ్రామానికి చెందిన బక్కశెట్టి రామన్న అనే రైతు ఈనెల 6న ఐకెపి కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించాడు. 23 రోజుల తర్వాత ఈనెల 28 ఆదివారం అతనికి ఐకెపి నిర్వాహకులు రశీదు పంపిణీ చేశారు. తాను అమ్మిన ధాన్యానికి, రశీదుకు తేడా రావడంతో సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. తాను విక్రయించిన 231 బస్తాల ధాన్యంలో 40 కిలోల బస్తా ఒక్కంటికి 42కిలోల చొప్పున ధాన్యం తూకం వేసి అదనపు 2కిలోల చొప్పున 462కిలోలు దోచుకున్నారని, అలాగే 231 బస్తాకు 219 బస్తాలకే రశీదు జారీ చేశారని, ఆ రశీదు కూడా ధాన్యం అమ్మినంక 23 రోజులకు ఇచ్చారని వాపోయారు. బస్తాల తేడాలో 12 బస్తాలు 40 కిలోల చొప్పున 480 కిలోలు దోపిడీకి గురయ్యానని, 219 బస్తాలకు కూడా 87 క్వింటాళ్ల 60 కిలోల ధాన్యం లెక్కకాగా 81క్వింటాళ్ల 60 కిలోలు మాత్రమే రశీదులో పేర్కొన్నారు. తప్పుడు లెక్కల రశీదుతో మరో 6క్వింటాళ్ల వరిధాన్యం నష్టపోయానని రామన్న అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి సెంటర్ నిర్వాహకుల దోపిడీ కారణంగా గత వర్షాకాలం కూడా 10బస్తాల వరిధాన్యం 4క్వింటాళ్ల డబ్బులు తనకు ఇంతవరకు రాలేదని ఆయన కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బుగ్గారం ఐకెపి వరిధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా మొత్తం 19.42క్వింటాళ్ల ధాన్యం, విలువ రూ.35,635  దోపిడీకి గురయ్యానని ఫిర్యాదులో ఆరోపించారు. తనకు న్యాయం చేసి దోపిడీకి గురైన వరిధాన్యం రూ. 35,635 ఇప్పించి ఆదుకోవాలని బక్కశెట్టి రామన్న అనే బుగ్గారం గ్రామ రైతు జగిత్యాల జిల్లా కలెక్టర్ ను కోరారు.

Related Posts