YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సోలార్ విద్యుత్తు చాలు... కేంద్రానికి ఏపీ లేఖ

సోలార్ విద్యుత్తు చాలు... కేంద్రానికి ఏపీ లేఖ

సోలార్ విద్యుత్తు చాలు... కేంద్రానికి ఏపీ లేఖ
విజయవాడ, జూన్ 30,
సోలార్ విద్యుత్‌తో పోలిస్తే బండిల్డ్ (సోలార్, థర్మల్) విద్యుత్ ధర ఎక్కువగా ఉండటంతో 675 మెగావాట్ల థర్మల్ విద్యుత్తును సరెండర్ చేస్తామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. ఈ మేరకు మే 14న లేఖ రాసిన ఏపీ ట్రాన్స్‌కో.. రాష్ట్ర డిస్కంలపై పెరుగుతున్న ఆర్థిక భారం దృష్ట్యా అనుమతించాలని కేంద్ర విద్యుత్తుశాఖ కార్యదర్శిని కోరింది. ‘జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం పథకం కింద ఎన్‌టీపీసీ నుంచి రాష్ట్రానికి 1,300 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 675 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం కుదిరింది.మూడేళ్లుగా సౌర విద్యుత్తు కంటే బండిల్డ్‌ పవర్‌ ధర (పాయింట్‌ ఆఫ్‌ కనెక్షన్‌ ఫీజుతో కలిపి) అధికంగా ఉంటోంది. 2019-20లో థర్మల్‌ విద్యుత్తు ధర (పీవోసీ ఫీజులతో కలిపితే) సగటున యూనిట్‌కు రూ.5.03 అవుతోంది. అదే బండిల్డ్‌ విద్యుత్తు కొనుగోలుకు సగటున యూనిట్‌కు రూ.4.85 అవుతోంది. సౌర విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.4.63 ఉంది. అంటే సౌర విద్యుత్తు ధర కంటే బండిల్డ్‌ ధర అధికంగా ఉంది’ అని లేఖలో ట్రాన్స్‌కో ఎండీ శ్రీకాంత్ పేర్కొన్నారు.నిబంధనల ప్రకారం.. సోలార్ విద్యుత్ ధర కంటే బండిల్డ్‌ విద్యుత్ ధర ఎక్కువగా ఉంటే అధికంగా ఉన్న థర్మల్‌ విద్యుత్‌ను వెనక్కు ఇచ్చే వెసులుబాటు లబ్ధిదారుకు ఉంటుందన్నారు. డిస్కంలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకుని జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం ఫేజ్‌-2 కింద ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 675 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ను వెనక్కి తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.కాగా, కర్ణాటకలోని కుడిగి, తమిళనాడులోని వల్లూరు ప్లాంట్ల నుంచి కొనుగోలుకు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ ట్రాన్స్‌కో కొన్నాళ్ల కిందట రాసి మరో లేఖ వెలుగులోకి వచ్చింది. ఈ కేంద్రాల నుంచి గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలకు అదనంగా కుడిగి నుంచి 385 మెగావాట్లు, వల్లూరు నుంచి 88 మెగావాట్ల బండిల్డ్‌ విద్యుత్‌ను ఎన్టీపీసీ కేటాయించింది.సాధారణంగా ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) 85 శాతం ఉండాలి. అయితే కుడిగిలో 21.586%, వల్లూరులో 45.822% మాత్రమే ఉంది. ఇవి రిజర్వ్‌ షట్‌డౌన్‌లోకి చేరుతున్నాయి. ఈ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి యూనిట్‌కు రూ.10 వరకు ఖర్చు అవుతోంది. దీంతో డిస్కంలపై అధిక భారం పడుతోంది. రివర్స్‌ షట్‌డౌన్‌ సమయంలో.. విద్యుత్తు డిమాండును తట్టుకునేందుకు డిస్కంలు బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక ధరకు కొనాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌టీపీసీ కుడిగి, వల్లూరు ప్లాంట్ల నుంచి దీర్ఘకాల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. దీనికి అనుమతి ఇవ్వండి’ అని ఆ లేఖలో ఏపీ కోరింది.

Related Posts