YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం విదేశీయం

నిషేధితచైనా యాప్స్ జాబితాలో జూమ్ పబ్ జీ లేక పోవడం పై చర్చ 

నిషేధితచైనా యాప్స్ జాబితాలో జూమ్ పబ్ జీ లేక పోవడం పై చర్చ 

నిషేధితచైనా యాప్స్ జాబితాలో జూమ్ పబ్ జీ లేక పోవడం పై చర్చ 
న్యూ ఢిల్లీ జూన్ 30
20 మంది భారత సైనికులను చంపిన చైనాపై ప్రధాని మోడీ యాక్షన్ ప్లాన్ మొదలైంది. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరిస్తూ భారత్ తో యుద్ధానికి కాలుదువ్వుతున్న చైనాకు తొలి హెచ్చరిక పంపారు మోడీజీ. 59 చైనా యాప్స్ ను దేశంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా మోడీ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిషేధానికి గురైన చైనా యాప్స్ జాబితాలో జూమ్ పబ్ జీ లేక పోవడం పై చర్చ మొదలైంది. జూమ్ యాప్ ను ‘ఎరిక్’ అనే అమెరికా పౌరుడు ప్రారంభించాడు. అయితే ఈ యాప్ యూజర్ల సమాచారాన్ని చైనాకు చేర వేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఎరిక్ ఖండించాడు కూడా...ఇక పబ్ జీ గేమ్ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ తయారు చేసింది. అయితే డిస్ట్రిబ్యూషన్ హక్కులు మాత్రం ఓ చైనా కంపెనీకి ఉన్నాయి.ఇలా చైనాకు దగ్గరగా ఉన్న ఈ రెండు యాప్ లపై మోడీజీ నిషేధం విధించలేదు. పబ్ జీ చైనాదేనని అందరూ చెబుతుంటారు. మరీ మోడీజీ ఎందుకు ఈ యాప్ పై నిషేధం విధించలేదన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. పబ్ జీ చైనాది కాదా అని ప్రశ్నిస్తున్నారు. అయితే పబ్ జీ జూమ్ యాజమాన్య హక్కులు చైనా చేతిలో లేనందువల్ల బ్యాన్ చేయలేదని కేంద్రంలోని వర్గాలు చెబుతున్నాయి.
 

Related Posts