.jpg)
అతనొక తేడా..రఘురామ కృష్ణంరాజుపైకారుమూరి తీవ్ర వ్యాఖ్యలు
ఏలూరు జూన్ 30
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీకి వెళ్లిపోతున్నారు కనుకనే మోదీ భజన చేస్తున్నారన్నారనితణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతనొక తేడా అంటూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఎంపీని తాము మనిషిలా గుర్తించడం లేదన్నారు. ఇదిలా ఉంటే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బంధువులు వందల కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ చేశారని ఆరోపించారు. కళా వెంకట్రావు మంత్రిగా ఉన్న సమయంలో ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తణుకు నియోజకవర్గంలో పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో తనపై బురద జల్లేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.