YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'పద్మావత్‌'పై మళ్లీ సుప్రీంలో పిటిషన్

'పద్మావత్‌'పై మళ్లీ సుప్రీంలో పిటిషన్

'పద్మావత్' విడుదలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలని ముందు నుంచి చెప్తున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మళ్లీ సుప్రీంకు కదిలాయి. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ మరోసారి పిటిషన్ వేశాయి. దీనిపై సుప్రీం కోర్టు ముందు ఇచ్చిన తీర్పును మార్చాలని వారు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించనుంది.ఇదిలా ఉంటే మరోవైపు కొన్ని ప్రదేశాలలో పద్మావత్‌ను ప్రదర్శించొద్దంటూ పలువరు థియేటర్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్ల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Related Posts