YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

శ్రీరెడ్డికి మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ....!!

Highlights

  • తెలంగాణ, కేంద్ర ప్రసార శాఖలను నోటీసులు
శ్రీరెడ్డికి మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ....!!

టాలీవుడ్ లో అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డికి ఊహించని మద్దతు లభించింది. ఆమెకు మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలిచింది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం ముమ్మాటికీ ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, కేంద్ర సమాచార ప్రసారశాఖలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారల్లోగా నివేదిక ఇవ్వాలని నోటీసులో ఆదేశించింది. మరో విషయం ఏమిటంటే... కేంద్ర మానవ హక్కుల కమిషన్ ను శ్రీరెడ్డి ఆశ్రయించకపోయినప్పటికీ... కమిషనే ఆమె కేసును సుమాటోగానే స్వీకరించి, చివరకు నోటీసులు జారీ చేసింది.కాగా శ్రీరెడ్డి వ్యవహారాన్ని తేల్చకుంటే మా అసోసియేషన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ యూత్ ఫోర్స్ తెలిపింది. ఈ మేరకు ఫిల్మనగర్‌లోని మా అసోసియేషన్‌కు తెలంగాణ యూత్ ఫోర్స్ వినతి పత్రం సమర్పించింది.శ్రీరెడ్డి వ్యవహారాన్ని త్వరితగతిన ముగించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాలని యూత్ ఫోర్స్ కోరింది. సినీ ఆర్టిస్ట్‌ల హక్కులను కాల రాసే అధికారం మా అసోసియేషన్‌కు లేదని వెల్లడించింది. స్త్రీలను గౌరవించే దేశంలో వారికి అన్యాయం జరిగితే వెంటనే పరిష్కరించాలని సూచించింది. అసోసియేషన్ వినకుంటే వారి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని తెలంగాణ యూత్ ఫోర్స్ హెచ్చరించింది.పొతేటాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తనదైన శైలిలో పోరాడుతోంది శ్రీరెడ్డి. తనతో జరిపిన ఛాటింగ్స్.. కొందరు పెద్దల గుట్టు ఇది అంటూ సోషల్ మీడియాలో.. ఛానళ్లలో లైవ్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా కరాటే కల్యాణిని తెలుగు అసోసియేషన్స్ బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.కరాటే కల్యాణి, ఆమె చెంచాలు అనవసరంగా ఎన్ఆర్ఐ(అమెరికా)లను దీనిలోకి లాగుతున్నారు. ఈ ఛండాలానికి అంతా కారణం మాఅసోసియేషన్. కల్యాణి ఎన్‌ఆర్ఐ బాడీస్‌కి ఈ ఛండాలాన్ని అంటించాలని చూస్తోంది. అందరు ఎన్ఆర్ఐలు ఈ విషయంపై స్పందించండి. కరాటే కల్యాణిని ప్రపంచం మొత్తం బాన్ చేయండి. అన్ని తెలుగు అసోసియేషన్స్ ఆమెను బ్యాన్ చేయండి. ఒకవేళ మాఅసోసియేషన్ ఫండ్స్ కోసం వస్తే వారిని ఎంకరేజ్ చేయకండి.. వాళ్లందరినీ రిజెక్ట్ చేయండి. ఎందుకంటే మాఅసోసియేషన్ ఆ ఛండాలాన్నంతా ఎన్ఆర్ఐకి అంటించాలని చూస్తోంది. ఈ విషయం మనసులో ఉంచుకోండి. ఒకవేళ ఈ ఛండాలన్నంతా ఆపకపోతే నేను యూఎస్‌కి వచ్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిజస్వరూపం ఏంటో బయటపెడతా. ఎంతమంది బ్లాక్ మెయిల్ చేసినా నేను ఈ పోరాటాన్ని ఆపను.అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.

Related Posts