YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

ప్రతి చేతి వృత్తి కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం మంజూరు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు

ప్రతి చేతి వృత్తి కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం మంజూరు చేయాలి                   రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు

హైదరాబద్ జూలై 7 
కరోనా రోగంతో చేతివృత్తులు - కుల వృత్తుల పూర్తిగా దెబ్బతిన్నాయని, వీరికి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవడానికి ప్రతి కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో బి.సి సంఘాల ఆఫీసులలో కుల సంఘం ఆఫీసులలో లేదా ఇండ్లలలో సామజిక దూరం పాటిస్తూ – మాస్కులు దరించి, దీక్షలు నిర్వహించారు.ఈ సందర్బంగా విద్యానగర్ లో జరిగిన కార్యక్రమం లో ప్రొపెసర్ కోదండరాం,చాడ వెంకట్ రెడ్డి బిసి యువజన సందం రాష్ట్ర అద్యక్షులు నేలం వెంకటేష్,తదితరులు పాల్గొని సాంఘి బావాన్ని తెలిపారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు అర.కృష్ణయ్య మాట్లాడు తూకాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి 28 వేల కోట్లు బడ్జెట్ ఉంటుంది కానీ పేద కులాల 5 లక్షల 77 వేల మంది కి  వారికి స్వయం ఉపాధి పథకాలు పెట్టుకోవడానికి 10 వేల కోట్లు ఇవ్వరా అని ప్రశ్నించారు.కరోనా దెబ్బతో కులవృత్తులు – చేతి వృత్తులు దెబ్బతిన్నాయి. చేనేత కులాల ఉత్పత్తులు అమ్ముడు పోవడంలేదు. నాయి బ్రహ్మణులు హెయిర్ కటింగ్  సేలున్స్ కు ప్రజలు రావడం లేదు. రజకుల చేత బట్టలు ఉతికించుకోవడం లేదు. విశ్వ బ్రహ్మణులు జ్యువెల్లరి షాపులలో నగలు కొనుగోలు చేసే వారు లేరు. గౌడుల కల్లు తాగడానికి ప్రజలు రావడం లేదు. ఇలా కుల వృత్తులు – సేవ వృత్తులు నడువడం లేదు. అకాల చావులు చచ్చే పరిస్థితి ఏర్పడింది. పక్క రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వం ఈ కుల వృత్తుల వారికి కుటుంబానికి 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పది వేల రూపాయల చొప్పున అన్ని కుల వృత్తుల వారికి సహాయం అందజేశారు. గుజరాత్ ప్రభుత్వం 15 వేల చొప్పున ఆర్థిక ప్యాకేజీ అందించారు. అన్నింట్లో అందరికంటే ముందుండే మన ప్రభుత్వం ఈ బి.సి కుల వృత్తుల వారికి సహాయం అందివ్వడానికి ముందుకు రాకపోవడం శోచనీయం ఇప్పటికైనా మన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 20 వేల చొప్పున ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.బిసి కార్పొరేషన్, 12 బీసీ కార్పొరేషన్ల ద్వారా మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసిన 5 లక్షల 77 వేల మందికి వెంటనే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని 14 బీసీ సంఘాలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు.  ఈ మేరకు లేఖ రాశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 సంవత్సరాల కాలంలో బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ఆర్థికంగా అణచి చేస్తున్నారని ఆరోపించారు.సబ్సిడీ రుణాల కోసం మూడు సంవత్సరాల క్రితం 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.  ఎన్నికల ముందు ప్రతి దరఖాస్తు ధరునికి రుణాలు ఇస్తామని వాగ్దానం చేశారు. అసలు రాష్ట్రంలో 60 లక్షల బిసి కుటుంబాలు ఉంటె ప్రచారం లేక 5 లక్షల 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడా రుణాలు ఇవ్వలేదు. రాష్ట ప్రభుత్వం ఈ 6 సం. రాల కాలంలో 2 లక్షల 40 వేల కోట్ల అప్పులు తెచ్చింది.  ఇంకా లక్షా 50 వేల కోట్ల అప్పులు తేవడానికి ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నవి. కాని 56 శాతం జనాభా గల బి.సిలకు ఇందులో వాటా ఏది? మొత్తం ఈ డబ్బును కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కలిసి మింగేశారు. కొత్త రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 12 లక్షల మంది వేచి చూస్తున్నారు. దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉన్న 5 లక్షల 77 వేల మందికి వెంటనే రుణాలు మంజూరు చేయకాపోతే కొత్త వారికి ఎప్పుడు అవకాశం వస్తుందని విమర్శించారు.గత 6 సంవత్సరాల పాలనలో 12 బి.సి కుల ఫెడరేషన్లు వడ్డెర, రజక, నాయి బ్రహ్మాణ, ఉప్పర, బట్రాజు, పూసల, విశ్వ బ్రహ్మణ, శాలివాహన, మెదరి, దర్జీ, వాల్మికి, గీత, ఫెడరేషన్లు ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదు. ఈ 6 సం.రాల కాలంలో ఈ ఫెడరేషన్లను ఉత్సవ విగ్రహాల వలే  తయారు చేశారని విమర్శించారు. రుణాలు ఇవ్వకుండా పాలక మండళ్ళు ఏర్పాటు చేయకుండ ఈ కులాల నాయకత్వాన్ని అణచి వేస్తున్నారని విమర్శించారు. ఈ ఫెడరేషన్లకు పాలక మండళ్ళు ఏర్పాటు చేస్తే ఈ కులాల నాయకత్వం పెరుగుగుతుంది. చైతన్యం వస్తుంది. అనేక సార్లు ముఖ్యమంత్రి కి మంత్రులకు విజ్ఞప్తి చేసిన బి.సి లను నిర్లక్ష్యం చేస్తున్నారు.లక్షలాది మంది స్వయం ఉపాధి పథకాలకు ముఖ్యంగా కులవృత్తులు, చేతివృత్తుల పథకాలు, కిరాణా షాపులు, మెడికల్ షాపులు, కూరగాయల షాప్ లు, జిరాక్స్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లు, బట్టల దుకాణాలు, డ్రై క్లీనింగ్ షాపులు హెయిర్ కటింగ్ సేలున్స్, బైక్, కార్లు మెకానిక్ సర్వీస్ సెంటర్లు, టైర్ల దుకాణాలు, బెకరి షాపులు, చిన్న హోటల్స్, టిఫిన్ సెంటర్లు, TV , కంప్యుటర్ రిపేరింగ్ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్ తదితర స్వయం ఉపాధి పథకాల కోసం  లక్షలాది మంది దరఖాస్తు చేసుకొని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని వీరికి రుణాలు ఇవ్వకుండ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే సబ్సిడీ రుణాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో  నర్సయ్య,జి.శంకర్,రామకిష్ణ,బుజ్జి,జి,అనంతయ్య,వి,వెంకటేశ్వరులు, కుమారి ఉత్తర,మహేందర్ గౌడ్,కాముని మధుసుసన్,సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts