YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ల్యాబ్‌క్యూబ్ కోవిడ్ సేఫ్టీ కీ ని ప్రారంభించిన హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

ల్యాబ్‌క్యూబ్ కోవిడ్ సేఫ్టీ కీ ని ప్రారంభించిన హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

న్యూ ఢిల్లీ జూలై 20 
ల్యాబ్‌ క్యూబ్ కంపెనీ మేకిన్ ఇండియాలో భాగంగా కొత్తగా తయారుచేసిన 'కోవిడ్ సేఫ్టీ కీ' ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి  జి కిషన్‌రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న ఎన్నారై వ్యాపారవేత్త శ్రీనివాస్ మానాప్రగడ, హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు ఆరోగ్యరాజు కలిసి తయారుచేసిన కోవిడ్ సేఫ్టీ కీ అందరికీ ఉపయోగపడేలా, కరోనా వైరస్ నుంచి రక్షించేలా ఉందన్నారు. కరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు అందరూ ఈ కోవిడ్ సేఫ్టీ కీ ని ఉపయోగించాలని సూచించారు.భారతదేశంలో మేకిన్ ఇండియా ప్రొడక్ట్‌గా తయారైన మొట్టమొదటి కోవిడ్ సేఫ్టీ కీని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఆరోగ్యరాజు అందజేశారు. శ్రీనివాస్ మానాప్రగడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన చర్యలు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి, ఆస్పత్రులకు ఇచ్చిన ముందు జాగ్రత్త కిట్‌లు, ఇతర పరికరాల పంపిణీ వంటివి చూసి, ఆ స్ఫూర్తితో ల్యాబ్‌క్యూట్ కంపెనీ సాధారణ ప్రజానీకం కోసం ఈ కోవిడ్‌సేఫ్టీ కీ ని తయారుచేసిందన్నారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మనాప్రగడ ఈ సేఫ్టీ కీ ద్వారా లభించే ప్రయోజనాలను కిషన్‌రెడ్డికి వివరించి, ఈ పరికరాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రాయాలు, రైల్వేస్టేషన్లు, బ్యాంక్‌లు, విద్యాలయాలు, కార్పోరేట్‌కంపెనీలు, షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల వినియోగించేలా చూడాలని కోరారు.
కోవిడ్ సేఫ్టీ కీ ఏమిటి ?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందడంతో భారతదేశంతో పాటుగా అమెరికాలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏ రూపంలో కరోనా వస్తుందోనన్న భయం ప్రజలను మరింత ఇబ్బందుల్లో పడేస్తుంది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎన్నో చోట్ల పరికరాలను తాకాల్సి ఉంటుంది. వీటి వల్ల వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా అని వీటిని తాకకుండా ఉండలేని స్ధితి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ల్యాబ్ క్యూబ్ ముందుకు వచ్చింది. భారత్‌లో కోవిడ్ పరికరాలను తయారుచేసే స్టార్టప్ కంపెనీగా ఉన్న ల్యాబ్ క్యూబ్ తమ ఉత్పత్తులలో భాగంగా కోవిడ్ 19 సేఫ్టీ కీ తయారుచేసింది.కాలిఫోర్నియాలోని సాంస్కృతిక రాయబారి శ్రీనివాస్ మానాప్రగడ, హైదరాబాద్‌లోని వ్యాపారవేత్త మల్లవరపు ఆరోగ్యరాజు కలిసి కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించడానికి విస్తృత ప్రయోజనాలు ఉన్న ఈ కోవిడ్ సేఫ్టీ కీ పరికరాన్ని ఉత్పత్తి చేశారు. కరోనా వచ్చిన రోగి తాకిన ప్రదేశాలు, ఉపరితలాన్ని ప్రత్యక్షంగా తాకకుండా ఉండేందుకు ఈ కీ ఉపయోగపడుతుంది.ప్రత్యేకమైన ఇత్తడితో దీనిని తయారుచేశారు. వైరస్ సాధారణంగా ఇతర లోహాలపై కన్నా ఇత్తడిపై కొద్దికాలం మాత్రమే బతుకుతుందని శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే !

Related Posts