YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కరోనాతో టీటీడీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి కన్నుమూత !

కరోనాతో టీటీడీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి కన్నుమూత !

తిరుపతి జూలై 20 
ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన  పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా విజృంభణ మొదలైంది. ఇప్పటికే టీటీడీలో  ఉద్యోగులు సిబ్బంది శ్రీవారి ఆలయ అర్చకులు కరోనా వైరస్ బారిన పడిన వేళ.. తొలి మరణం నమోదైంది తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు సోమవారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు గత  కొద్ది రోజుల క్రిందట కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వడంతో ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఈయన గత ఏడాది పదవీ విరమణ చేసారు.  ఆ తరువాతఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉన్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో గత నాలుగు రోజులకు ముందు స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో  ఈ రోజు ఉదయం కన్నుమూశారు.  సాదారణంగా ఆలయ సంప్రదాయాల మేరకు గౌరవ లాంచనాలతో టిటిడి ఆయన అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కరోనా కారణంగా చనిపోవడంతో  ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు కానీ మరొకరికి కానీ అప్పగించే అవకాశం కూడా లేదని సమాచారం. కాగా ఇప్పటికే 18 మంది అర్చకులకు కరోనా పాజిటీవ్ రావడంతో విధులకు దూరంగా ఉన్నారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు  మృతిపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related Posts