YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

క్లిష్ట సమయంలో... విమర్శలు వద్దు కలిసి కట్టుగా మహమ్మారి పై పోరాటం చేద్దాం - మంత్రి తన్నీరు హరీష్ రావు

క్లిష్ట సమయంలో... విమర్శలు వద్దు కలిసి కట్టుగా మహమ్మారి పై పోరాటం చేద్దాం - మంత్రి  తన్నీరు హరీష్ రావు

సిద్దిపేట  జులై 22  
కోవిడ్ పై ప్రభుత్వం సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మంత్రి  తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. కోవిడ్ పోరాటంలో సైనికుల మాదిరి ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పోలీస్ లు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారి నైతిక స్థైర్యం దెబ్బతినేలా విమర్శలు చేయవద్దని రాజకీయ పార్టీలు,ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్వీఎం  ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం గల కోవిడ్ బ్లాక్, ల్యాబ్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి బాగున్నారా అంటూ.. వైద్యులు, స్టాఫ్ నర్స్ లు పలకరించారు.బాగా పని చేయాలని సూచించారు. బాధితులను కుటుంబ సభ్యులు గా భావించి వైద్య సేవలు అందించాలన్నారు. చిరునవ్వుతో నే సగం రోగం నయం అవుతుందని.. రోగులతో ప్రేమతో వ్యవహరించాలన్నారు .బాధితులకు చికిత్స అందించే సమయంలో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ మంత్రి వైద్యులు, స్టాఫ్ నర్స్ లకు సూచించారు.
అనంతరం కోవీడ్ ఐసొలేషన్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. వరంగల్ నుంచి వచ్చి కోవి డ్ బ్లాక్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడి తో మంత్రి మాట్లాడారు. అరోగ్య పరిస్థితి నీ అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేందుకు వైద్యులు సూచ నలు పాటిం చాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో మాదిరే కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ అందించేందుకు ఈ ఆసుపత్రిలో ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో 100 పడకల సామర్థ్యం గల కోవీడ్ బ్లాక్ ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇదే ఆసుపత్రిలో ఒకే రోజు 300 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా టేస్టింగ్ సెంటర్ లో అన్ని సౌకర్యాలు కల్పించా మన్నా రు.. ఇప్పటికే అనుమతుల కోసం ఐసిఎంఆర్ కు ప్రతిపాదనలు పంపించా మన్నా రు. ఆర్వీఎం  ఆసుపత్రి, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో టెస్టింగ్ సెంటర్ ల చేసేందుకు ఐసీ ఎం ఆర్ నుంచి అనుమతులు రాగానే ఒకే రోజు 600 మందికి జిల్లాలో పరీక్షలు చేసే అవకాశం ఉంటుందన్నారు.  వ్యాధి లక్షణాలతో బాధపడే వారు ఆసుపత్రికి రావాలని అన్నారు.  కోవి డ్ నిర్ధారణ అయితే బాధితులకు కోవీడ్ ఐసొలేషన్ బ్లాక్ లో ఉంచి వైద్య సేవలు అందిస్తామని అన్నారు. వ్యాధి బారిన పడ్డప్పటికి లక్షణాలు లేకుంటే వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్ లోనే ఉంచి వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు.  స్వీయ వైద్యంతో సీరియస్ అయ్యే వరకు బాధితులు వేచి చూడవద్ద న్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే బాధితులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి లకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. స్థానిక ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో కూడా ర్యాపిద్ టెస్ట్ లు చేస్తున్నారని మంత్రి తెలిపారు.
కరోనా వ్యాధి వచ్చిందని తెలియగానే కొందరు షై గా ఫీలవుతున్నార నీ ... నిర్లక్ష్యంగా ఉంటే ఎవ్వరికైనా వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. కొన్ని సమయాల్లో ఇతరుల నిర్లక్ష్యం వల్ల కూడ వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ప్రజలు అతిగా భయపడ వద్దని... అదే సమయంలో నిర్లక్ష్యం కూడా తగదని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తూ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వసతులతో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న దని మంత్రి తెలిపారు అలాగే అన్ని జిల్లాల్లో కూడా బాధితుల కోసం ప్రత్యేకంగా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తుందన్నారు. కోవిడ్ ఐసొలేషన్ బ్లాక్ లో వేడి వాటర్ తో పాటు ప్రతి రోజూ రూ.250 విలువైన ప్రోటీన్లతో కూడిన సంతులిత ఆహారం ప్రభుత్వం అందజేస్తు  దన్నారు.  పీపీఈ కిట్స్, మెడిసిన్ కూడ ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచిందన్నారు.
కోవిడ్ పోరాటంలో సైనికుల మాదిరి ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పోలీస్ లు, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వారి నైతిక స్థైర్యం దెబ్బతినేలా విమర్శలు చేయవద్దని రాజకీయ పార్టీలు,ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మహమ్మారిని వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు ఇష్టారీతిన రోడ్లపై తిరగవద్ద నీ అన్నారు. క్లిష్ట సమయంలో కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వన భోజనాలు , సామూహిక ఫంక్షన్లు, కార్యక్రమాలను నిర్వహించ వద్దన్నారు. అవసరమైతే తప్ప అడుగు బయటకు పెట్టవద్దని మంత్రి ప్రజలను కోరారు. లాక్ డౌన్ ఉన్నదని భావించి ప్రజలు స్వీయ నిర్బంధం పాటించాలన్నారు. ప్రభుత్వ సూచనలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.
ప్రారంభ కార్యక్రమంలో  మంత్రి వెంట మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్  వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్  ముజమ్మీల్ ఖాన్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, వైద్యాధికారి కాశీనాథ్, ఇతర ప్రజా ప్రతినిధులు  వైద్య అధికారులు, డాక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

Related Posts