YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ట‌చ్ చేసి చూడు..

ట‌చ్ చేసి చూడు..

 టైటిల్ సాంగ్ వ‌చ్చేసింది..

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫుల్ ఎన‌ర్జీతో దూసుకొస్తున్నాడు. రాజా ది గ్రేట్ అంటూ దుమ్మురేపిన ఈ హీరో ఇప్పుడు ట‌చ్ చేసి చూడు అంటూ స‌వాల్ విసురుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో ర‌వితేజ ఫుల్ జోష్ లో క‌న్పిస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ర‌వితేజ‌. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవితేజకు జోడీగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌ గా నటిస్తుంది.


రవితేజ క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఈ పాటకు మార్క్‌ డి మ్యూస్‌ సంగీతం అందించ‌గా చంద్రబోస్ సాహిత్యమందించారు. బ్రిజేష్  శాండిల్య, శ్రీరామ్ చంద్రలు ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర నిర్మాత‌లు. రాజా ది గ్రేట్ సినిమా సూప‌ర్ హిట్ కావ‌టంతో ర‌వితేజ అభిమానులు ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌నే ధీమాతో ఉన్నారు.

Related Posts