YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం తెలంగాణ

తెలుగు సాహిత్యంలో సినారె పేరు చిరస్మరణీయం

తెలుగు సాహిత్యంలో సినారె పేరు చిరస్మరణీయం

హైదరాబాద్ జూలై 29, 
 తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన సినారె 88 వ జయంతి ఉత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,   యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,   తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి,  దేశపతి శ్రీనివాస్,  మామిడి హరికృష్ణ,  డాక్టర్ ఎంకె రాము,  డాక్టర్ జుర్రు చెన్నయ్య తదితరులు పాల్గోన్నారు.  తెలంగాణ సారస్వత పరిషత్ అందించే సినారె సాహితీ పురస్కారం దర్భశయనం శ్రీనివాసాచార్యకు అందజేసారు. సుశీలా నారాయణరెడ్డి ప్రచురించిన డాక్టర్ సినారె సినీగీత సర్వస్వం ఆరో సంపుటి ఆవిష్కరించారు.
మంత్రి మాట్లాడుతూ తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు సినారె పేరు చిరస్మరణీయం.  ఆయన సాహిత్యంలో కవిరాజు .. నిత్య జీవితంలో రారాజు. - విశ్వంభర కావ్యంతో వారి కీర్తి విశ్వమంతా వ్యాపించింది.  వారి పేరును భవిష్యత్ తరాలకు అందించే క్రమంలో మనందరం ఎవరికి తోచిన ప్రయత్నం వారు చేయాలి.  గత ఏడాది రెండు రోజులు వనపర్తిలో సినారె జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది.  ఈ తరానికి వారి స్ఫూర్థిని అందించడానికి సదస్సు అంశాలు  సంచిక ఉండాలని ‘మన సినారె’ ప్రత్యేక సంచికను తీసుకువచ్చాం.  సినారె సాహిత్య సదన్ కు నేడు హైదరాబాద్ లో శంకుస్థాపన జరగడం శుభసూచకం .  -  ఆగస్టు 25న సురవరం ప్రతాపరెడ్డి గారి కాంస్య విగ్రహం , వచ్చే ఏడాది సినారె జయంతి నాటికి సి.నారాయణరెడ్డి గారి కాంస్య విగ్రహం వనపర్తిలో ఆవిష్కరిస్తామని అన్నారు,
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ నారాయణ రెడ్డి కి నా మీద పుత్ర ప్రేమ.  వారికి నేను ఏకలవ్య శిష్యున్ని.  ఢిల్లీలో రాజ్యసభ్యుడిగా వారితో పాటు నేను ఐదేళ్లు ఉండడం నా అదృష్టమని అన్నారు.  వారిని ఢిల్లీలో ఎవరు భోజనానికి పిలిచినా నన్ను తప్పక తీసుకెళ్లేవారు, నేను వస్తానని చెప్పేవారు.  విశాఖలో మూడు రోజులు సినారె  జన్మదిన వేడుకలు చేశాం. వారిని పల్లకిలో ఊరెగిద్దామనుకుంటే ప్రమాదం జరిగి ఉండడంతో  వారి పుస్తకాలను ఊరేగించాం. భారత ప్రధాని వాజ్ పేయి ని పార్లమెంట్ హాలులో నిలబెట్టి గజల్ వినిపించిన గొప్ప వ్యక్తి సినారె అని అన్నారు.

Related Posts