YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

27 జిల్లాల్లో లోటు వర్షపాతం 63 శాతమే పంట సాగు

27 జిల్లాల్లో లోటు వర్షపాతం 63 శాతమే పంట సాగు

27 జిల్లాల్లో లోటు వర్షపాతం
63 శాతమే పంట సాగు
హైద్రాబాద్, 
వర్షాలు అనుకూలించకపోతే 21.67 లక్షల ఎకరాల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందులో కోసం 1.95 లక్ష ల క్వింటాళ్లు వివిధ రకాల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. అదే సమయంలో ఆగ స్టు 15వ తేదీ వరకు వానలు సరిగ్గా రాకపోతే 23 లక్షల ఎకరాల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యామ్నాయ పం టలు వేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 వరకు 317.2 మిల్లిమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 200.2 మిల్లి మీటర్లు మాత్రమే కురిసింది. మొత్తంగా 37 శాతం లోటు ఉంది. 27 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో తీవ్ర లోటు ఉన్నట్లు వ్యవసాయ శాఖ నివేదికలో పేర్కొంది. ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.ఇందుకోసం 2.29 లక్షల క్వింటాళ్లు వివిధ రకాల విత్తనాలు అవసరం కానున్నట్లు తేల్చారు. అయితే వాతావరణ శాఖ మాత్రం జూలై చివర నుంచి ఆగస్టులో ఆశించిన మేర వర్షాలు కురుస్తాయని అంచ నా వేస్తోంది. అసలు రాష్ట్రంలో ప్రస్తుతం సాగు పరిస్థితి ఎలా ఉంది ? భూగర్భ జలాలు, వర్షపాత ం, ముందున్న యాక్షన్ ప్లాన్ వంటి వాటిపై ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టత రానుందఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయాబీన్, కంది, మొక్కజొన్న జొన్న పంటల మొలకలు ఎదుగుతున్నాయి. అన్నీ పంటలు బాగానే ఉన్నట్లు అక్కడి అధికారులు వ్యవసాయ కమిషనర్‌కు నివేదించారు. ఇక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికను అన్వయించుకోలేదు. మెదక్ జిల్లాలో చిరుధాన్యాలు, పత్తి విస్తీర్ణం పెరిగింది. జిల్లా స్థాయిలో చిరుధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇంకా అమల్లోకి తీసుకోలేదు.జనగాం జిల్లాలో నేలలతో తేమ శాతం తగ్గిపోవడంతో పత్తి, పప్పు పంటలు ఎదగడం లేదు. స్వల్పకాలిక మొక్కజొన్న, కంది పంటల ప్రణాళికను అమలు చేయనున్నారు.నల్లగొండ జిల్లాల్లో 20 శాతమే పంటల సాగు నమోదైంది. మొలకెత్తిన విత్తనాలు వాడిపోతున్నాయి. దేవరకొండ లాంటి ప్రాంతాల్లో పత్తి రైతులు మళ్లీ దుక్కులు దున్ని విత్తుతున్నారు. ఈ నెల 31 వరకు వానలు రాకపోతే సజ్జలు, స్వల్పకాలిక కందులు, క్యాస్టర్ నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఒక వేళ15వ ఆగస్టు వరకు వానలు రాకపోతే చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, సజ్జల సాగుకు రైతులను మళ్లించనున్నారు.మహబూబాబాద్‌లో మొక్కజొన్న, కందులు, నూనె గింజల పంటల సాగును ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద సాగు చేయనున్నారు. వరి రైతులు పప్పు, మొక్కజొన్న పంటలు, పత్తి రైతులు నూనెగింజలు, ఇతర పప్పు పంటలు వేసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. జగిత్యాల్, పెద్దపల్లి జిల్లాలోనూ వరి నుంచి పప్పుల వైపు, మొక్కజొన్న, గడ్డి జొన్న పంటలు వేసేలా చూడనున్నారు. వికారాబాద్‌లోనూ పత్తి పంటలు వేసుకునే చోట్ల చిరుధాన్యాలు సాగువైపు మళ్లారువరంగల్ అర్బన్, రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కత్తెర పురుగు విస్తరిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి అన్నీ పంలు సాధారణ స్థితిలో ఉన్నట్లు అక్కడి అధికారులు నివేదించారు. నిజామాబాద్, కరీంనగర్, ములుగు, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.యదాద్రి భువనగిరి జిల్లాల్లో పత్తి జర్మినేషన్ చాలా తక్కువగా ఉంది. వర్షాలు లేకపోవడంతో చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తూ వాటి సాగుకు ప్రోత్సాహిస్తున్నారుసాధారణ వర్షపాతం నమోదైన జిల్లాల్లో పంటల పరిస్థితిపై ఆయా జిల్లా వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ప్రకారం కామారెడ్డిలో భూగర్భ జలాలు అంతగా లేకపోవడం వర్షాలు లేక వరి మడికట్లలో రైతులు మొక్కజొన్న, పత్తిని వేసుకున్నారు. సిరిసిల్లలో ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ ప్రణాళికను అనువదించుకోలేదు. పత్తిలో మాత్రం 2 శాతం యూరియాను వేసుకోవాలని శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు.మహబూబ్‌నగర్‌లో మొక్కజొన్నకు బదులుగా రైతులు జొన్నలు, కందులు, పెసర్లు, ఇతర చిరుధాన్యాల సాగుకు మళ్లారు. వర్షాలు లేకపోవడం, గత మూడు సంవత్సరాలు కత్తెర పురుగుతో మొక్కజొన్న పంట నష్టం మిగల్చడంతో ఈ పంటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణ్‌పేట, ఆసిఫాబాద్‌లలో వేసిన పంటలు సాధారణ స్థితిలో ఉన్నాయని, కొన్నిచోట్ల ఎరువులు, పురుగు మందుల వాడకం అవసరమని సూచించారురాష్ట్రంలో ఇప్పటి వరకు 67.82 లక్షల ఎకరాల్లో (63 శాతం) వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో ప్రధానంగా పత్తి 39.23 లక్షల ఎకరాల్లో 92 శాతం సాగైంది. జొన్నలు 80 వేల ఎకరాలు, మొక్కజొన్న 6.78 లక్షల ఎకరాలు, కందులు 5.63 లక్షల ఎకరాలు, వరి 5.25 లక్షల ఎకరాలు, పెసర్లు 1.31 లక్షల ఎకరాలు, మొత్తం పప్పు పంటలు 47.69 లక్షల ఎకరాలకు గాను 20.80 లక్షల ఎకరాలు (44 శాతం) సాగైనట్లు. సోయాబీన్ 4.08 లక్షల ఎకరాల్లో వేశానిజామాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు, పత్తికి గద్వాల, సిరిసిల్ల జిల్లాల్లో గులాబీ రంగు పురుగును గమనించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. నర్సరీ స్టేజ్‌లో ఉన్న వరికి కూడా స్టెమ్ బోరర్‌ను కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో గుర్తించారు. అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించాలని సూచించారు.

Related Posts