YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనాతో పాటు సీజనల్ ఫీవర్ టెన్షన్

కరోనాతో పాటు సీజనల్ ఫీవర్ టెన్షన్

కరోనాతో పాటు సీజనల్ ఫీవర్ టెన్షన్
హైద్రాబాద్,
వాతావరణ మార్పులతో నగరంపై రోగాలు దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రికి వారం రోజులుగా రోగుల సంఖ్య బాగా పెరిగింది. కాలుష్య జలాలు, కలుషిత ఆహారం, దోమల కారణంగా పలు రోగాలు విజృంభిస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువగా చిన్న పిల్లలు ఉంటున్నారు. చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా రోగాలకు దూరంగాఉండవచ్చునని కిమ్స్‌కు చెందిన నిపుణులు డాక్టర్‌ పాపారావు తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలను శుభ్రంగా కడుక్కొని తినాలి. ఎక్కువగా తాజాగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ కాలంలో బయటి ఆహారానికి దూరంగా ఉండటం మేలు.  డయేరియా సోకిన వెంటనే రోగి తక్కువ సమయంలోనే నీరసించి పోతాడు. డీహైడ్రేషన్‌ కాకుండా ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగిస్తూ ఉండాలి. ఒకవేళ ఓఆర్‌ఎస్‌ అందుబాటులో లేకపోతే లీటరు నీటిని తీసుకోవాలి. కాచి చల్చార్చి వడబోసిన తర్వాత... అందులో 2 స్పూన్ల పంచదార, సగం స్పూన్‌ ఉప్పు, సగం స్పూన్‌ వంటసోడా వేసి బాగా కలిపి కొంచెం నిమ్మరసం జతచేయాలి. డయేరియాతో బాధపడే వారికి దీనిని అందిస్తూ ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోవచ్చువర్షాకాలంలో ఎక్కువగా కలుషిత నీటి వల్ల అతిసారం, టైపాయిడ్‌, వైరల్‌ ఫీవర్‌, జీర్ణాశయాల ఇన్‌ఫెక్షన్లు, విరేచనాలతోపాటు వైరల్‌ వ్యాధులైన రొటావైరస్‌, కామెర్లకు కారకాలైన హెపటైటిస్‌ ఏ, ఈ వంటివి వ్యాప్తి చెందుతుంటాయి. ఈ నేపథ్యంలో కాచి వడపోసిన నీరు తాగడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాల శుభ్రత పాటించాలి.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి. వర్షాకాలంలో దోమల వృద్ధి ఎక్కువ. ఇప్పటికే నగరంలో డయేరియా, డెంగీ జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. గత రెండు నెలల్లో గాంధీ ఆసుపత్రిలో 30 వరకు డెంగీ కేసులు నమోదు అయ్యాయి. మలేరియాదీ అదే పరిస్థితి. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లను పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. దోమల వృద్ధికి మూల కేంద్రాలైన గుంతలను పూడ్చివేయాలి. ట్యాంకులు, పూలకుండీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కొబ్బరి చిప్పలు, పాత టైర్లు పరిసరాల్లో లేకుండా చూసుకోవాలి. దోమ కాటుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మస్కిటో రిపిల్లెంట్స్‌, దోమ తెరలు, మస్కిటో రిపిల్లెంట్‌ క్రీములు వాడటం, కాళ్లు చేతులు, కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. పిల్లల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలకు తెరలు ఏర్పాటు చేసుకోవాలి. ఫ్లవర్‌వాజ్‌ల్లో ఉండే నీటిని సమయానుకూలంగా మార్చుతూ ఉండాలి. తద్వారా దోమలు ఆ నీటిలో వృద్ధి చెందకుండా చూసుకోవచ్చు. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం అనేవి అత్యంత సహజం. జ్వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. 3-5 రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం ఉండడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, వాంతులు లాంటివి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మలేరియా, డెంగీ లాంటివి ఈ కాలంలో ఎక్కువ ప్రమాదం. ఈ కాలంలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వేధిస్తుంటాయి. శరీరం పొడిగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. కాళ్లు, పాదాలు, మణికట్టు, ముంజేయి వంటి చోట్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వీటిని వీలైనంత పొడిగా ఉంచుకోవాలి. యాంటీఫంగల్‌ పౌడర్‌ ఉపయోగించాలి. రిజర్వాయర్లు నిండటం వల్ల ఎక్కువగా బురద రంగుతో కూడిన నీళ్లు సరఫరా అయ్యే అవకాశం ఉంది. బిందెలో పట్టుకున్న వెంటనే వాడుకోకుండా కదపకుండా ఒకచోట పెట్టాలి. కొంత సమయం తర్వాత మట్టి రేణువులు అన్ని బిందె అడుగు బాగానికి చేరతాయి. ఈ నీటిని కాచి చల్లార్చి వడబోసి తాగాలి. దీనివల్ల డయేరియా, టైఫాయిడ్‌ లాంటి వ్యాధులు సోకకుండా చూసుకోవచ్చు. వ్యక్తిగత శుభ్రత కూడా ముఖ్యం. పిల్లలకు కూడా నేర్పించాలి. బయట నుంచి వచ్చిన తర్వాత సబ్బుతో కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. జలుబు, దగ్గు లాంటివి ఉంటే తుమ్మినప్పుడు చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. దీనివల్ల ఇతరులకు సోకకుండా చూసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు గుంపులకు దూరంగా ఉండాలి.

Related Posts