YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆన్ లైన్ లో అమ్మాయిలు... కొత్త దందా

ఆన్ లైన్ లో అమ్మాయిలు... కొత్త దందా

ఆన్ లైన్ లో అమ్మాయిలు... కొత్త దందా
హైద్రాబాద్, 
టెక్నాలజీని కొంతమంది వక్రమార్గంలో వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. ఇందులో ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. ప్రధాన నిర్వాహకురాలు, ఆమె సహాయకుడు చిన్నా పరారీలో ఉన్నారు.గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన వంశీరెడ్డి, విజయవాడకు చెందిన మహిళ, చిన్నాలు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరికి వివిధ రాష్ట్రాల్లో యువతులను సరఫరా చేసే దళారులతో పరిచయం ఉంది. వీరికి కొంత నగదు చెల్లించి..కోల్ కతాకు చెందిన నలుగురు యువతులను తీసుకొచ్చారు. నగరంలోని బల్కంపేటలో అద్దె ఇంట్లో ఉంచారు. కొన్ని సోషల్ మీడియా సైట్స్, లొకాంటో వెబ్ సైట్ లలో వీరి ఫొటోలను ఉంచారు.దీంతో వీరి ఫొటోలను చూసిన వారు నిర్వాహకులకు ఫోన్ చేస్తున్నారు. విటుల నుంచి ఫోన్ రాగానే..నిర్వాహకులు అలర్ట్ అవుతారు. వారేనా కాదేనా ? అని ఎంక్వయిరీ చేస్తారు. ట్రూ కాలర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా సైట్స్ లో నంబర్ ను పరిశీలిస్తారు. నమ్మకం కుదరగానే…ఆ నంబర్ కు తిరిగి ఫోన్ చేస్తారు.గూగుల్పే, పేటీఎం ద్వారా కొంత డబ్బును ముందుగానే తీసుకుంటారు. మొత్తం వ్యవహారం ఆన్ లైన్ లోనే కొనసాగుతుంది. మరుసటి రోజు, విటులు కోరుకున్న సమయంలో యువతులను తీసుకెళుతారు. మల్కాజ్ గిరి ఎస్వోటీ సీఐ నవీన్ కుమార్, కీసర సీఐ నరేందర్ ఆధ్వర్యంలో డెకాయి ఆపరేషన్ నిర్వహించారు.నిర్వాహకులను మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లికి రప్పించి…వంశీరెడ్డిని అరెస్టు చేశారు. ఈ విషయం తెలియడంతో ప్రధాన నిర్వాహకురాలు, చిన్నా..పరారయ్యారు. ముఠా గుట్టురట్టు చేసిన పోలీసు సిబ్బందిని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు

Related Posts