YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

కరోనా రోగికి శ్మశానంలో చికిత్స

కరోనా రోగికి శ్మశానంలో చికిత్స

కరోనా రోగికి శ్మశానంలో చికిత్స
మెదక్,
కరోనా రోగుల పట్ల వివక్ష చూపొద్దని ప్రభుత్వం ఎంత చెప్పిన చాలా చోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ తండాలో కరోనా రోగులను శ్మశానంలో ఐసోలేషన్లో ఉంచారు. కరోనా బాధితుల పట్ల వివక్ష చూపొద్దు. మనం పోరాడాల్సింది వ్యాధితో.. రోగితో కాదు.. అని ప్రభుత్వాలు ఎంత చెబుతున్నా ఫలితం ఉండటం లేదు. తమ ప్రాంతంలో ఎవరికైనా కరోనా సోకినట్లు తెలియగానే జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా బాధితులను ఊళ్లోకి రానీయడానికి అంగీకరించడం లేదు. కొద్ది రోజుల క్రితం తమ పట్ల ఎంతో ఆప్యాయత కనబర్చిన వారే.. ఇప్పుడు వివక్ష చూపుతుండటాన్ని కరోనా బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కల్హేరు మండలం ఖానాపూర్ తండాలో కరోనా పేషెంట్లను ఊళ్లోకి రానీయకపోవడంతో.. వారిని శ్మశానంలో ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి తలెత్తింది. ఖాన్పూర్ గ్రామం నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సొంతూరు కావడం మనార్హం.ఖానాపూర్ తండాలో  ముగ్గురికి కరోనా సోకినట్లు తేలింది. హోమ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యాధికారులు వారికి సూచించారు. కానీ వారిని ఊళ్లో ఉంచడానికి గ్రామ పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని వైద్య సిబ్బంది గ్రామ శివారులోని శ్మశాన వాటికలో వారికి బస ఏర్పాటు చేశారు. హాస్పిటల్కు తీసుకెళ్లడానికి వైద్య సిబ్బంది అంగీకరించకపోవడం.. ఊళ్లోకి రానీయడానికి గ్రామస్థులు ఒప్పుకోకపోవడంతో కరోనా బాధితులు శ్మశానంలోని రేకుల షెడ్డులో తలదాచుకుంటున్నారు. ట్యాబ్లెట్లు ఇవ్వడం మినహా రెండు రోజులుగా వారిని వైద్య సిబ్బంది పట్టించుకోలేదని సమాచారం.

Related Posts