YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు
ముంబై, 
పసిడి పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం అడ్డూఅదుపు లేకుండా పెరిగిపోతూనే ఉంది. భగభగమంటోంది. ఈరోజు కూడా బంగారం ధర జిగేల్‌మంది. ధగధగమంటూ దూసుకెళ్లింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఆకాశాన్నంటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగింది. దీంతో ధర రూ.56,810కు చేరింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.52,080కు ఎగసింది.పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.350 దిగొచ్చింది. దీంతో ధర రూ.65,050కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.65 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 2021 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 26.01 డాలర్లకు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పైకి కదిలింది. రూ.52,550కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.100 పెరుగుదలతో రూ.53,750కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.350 తగ్గుదలతో రూ.65,050కు క్షీణించింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts