YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సాగర్‌ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి సీఎం కేసీఆర్‌ ఆదేశం

సాగర్‌ ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి   సీఎం కేసీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌ ఆగష్టు 7
నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో ఇవాళ్టి నుంచి నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ శుక్రవారం నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణానది ఎగువన నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున రైతులకు నీరివ్వాలని సాగర్‌ చీఫ్‌ ఇంజినీర్‌కు సూచించారు. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న సాగర్‌ ఆయకట్టుకు రైతులకు వానకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు. కాగా, నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం నీటి నిల్వ 224కు టీఎంసీలు ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం దిగువకు భారీగా నీరు వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 42,378 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 552.60 అడుగులు కాగా, ప్రస్తుతం 556.60 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో 224.32 టీఎంసీల నీరుంది. కృష్ణా నది ఎగువ గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులు నిండిపోయాయి. ఆల్మట్టి, నారాయణపురం నిండడంతో జూరాల మీదుగా జలాలు శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద కొనసాగుతుంది. ఈ సారి వర్షాలు సైతం భారీగా కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వం రైతులకు వానకాలం పంట కోసం నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Related Posts