YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఆగస్టు 12వ తేదీన వ్యాక్సిన్ విడుదల

ఆగస్టు 12వ తేదీన వ్యాక్సిన్ విడుదల

న్యూ ఢిల్లీ  ఆగష్టు 8 
కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ అతి త్వరలో రాబోతోంది. ఆగస్టు 12వ తేదీన వ్యాక్సిన్ విడుదల చేస్తున్నట్లు రష్యా దేశ ఆరోగ్య మంత్రి ఒలేగా గ్రిడ్నెవ్ వెల్లడించారు. ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ ను ఆగస్టు 12న రిజిస్టర్ చేయించనున్నట్టు ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఒలెగ్ గ్రిడ్నెవ్ తెలిపారు. దేశంలో భారీ స్థాయిలో వ్యాక్సి నేషన్ అక్టోబర్ లో ప్రారంభం అవుతుంది అని ఇంతకుముందే చెప్పారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే సొమ్ము మొత్తాన్ని తమ దేశమే పెడుతుంది అని అన్నారు. ప్రస్తుతం చివరి దశ నడుస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ టైమ్ . జనానికి సురక్షితమైన టీకాను అందించాలి. తొలుత సీనియర్ సిటిజన్లు మెడికల్ సిబ్బందికి టీకాలేస్తాం అని చెప్పారు. వ్యాక్సిన్ను గమలేయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ రష్యా రక్షణ శాఖ కలిసి అభివృద్ధి చేశాయని అన్నారు. రష్యా ప్రజల్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యాక వ్యాక్సిన్ పనితీరును అంచనా వేస్తాం అని చెప్పారు. వ్యాక్సిన్ తయారీ రెండు రకాలుగా ఉంటుందని రెండూ కలిపితే ఇమ్యూనిటీ పెరుగుతుందని తెలిపారు. తొలిదశలో వైద్య నిపుణులు సీనియర్ సిటిజన్లకు టీకాలు వేస్తామని చెప్పారు. టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభం అయ్యాయని 38 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వగా అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని వెల్లడించారు. వ్యాక్సిన్ వేసిన ఫస్ట్ గ్రూప్ను జులై 15న సెకండ్ గ్రూప్ను జులై 20న డిశ్చార్జి చేశారు. రష్యాలో మరో కంపెనీ వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నా లజీ కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తోంది.

Related Posts