YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వర్షం నీటి తొలగింపు

వర్షం నీటి తొలగింపు

కరీంనగర్  ఆగష్టు 11  
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన  వర్షం నీటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్ వై.సునిల్ రావు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కరీంనగర్ నగరంలో నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాలను ఈ రోజు నగర మేయర్ వై.సునిల్ రావు సందర్శించారు.  9 వ డివిజన్ లోని అల్కపురికాలని,29 వ డివిజన్ అశోక్ నగర్, మరియు బ్యాంకు కాలనీ, తులసీ నగర్ లాంటి శివారు ప్రాంతాల్లో నివాస గృహాల మద్య... ఖాళీ స్థలాల్లో నిలిచిన వర్షం నీటిని మేయర్ సునిల్ రావు పరిశీలించారు. స్థానికంగా ఉండి నిటిని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. ఖాళీ స్థలాల్లో నిలిచిన నీటిని కచ్చ కాలువల ద్వారా డ్రైనేజీలకు మల్లించారు. అంతే కాకుండ నగరపాలక సంస్థకు సంబందించిన జేసీబీ యంత్రాలను సంబందిత ప్రాంతాలకు పంపించి...నీటి తొలగింపు చర్యలు చేపట్టారు. నగరంలోని 9 వ డివిజన్ అల్కపురికాలనీలో పర్యటించి... డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. సంబందిత ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి... డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు... ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో వేసిన డ్రైనేజీలు విస్తారంగా లేకపోవడంతో...నీరు బారిగా నిలుస్తున్నాయని...వాటి కేపాసిటి పెంచేందుకు ఎస్టిమేషన్లు తయారు చేయాలని స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు. మరో వైపు డివిజన్ లో పర్యటిస్తూ... గత కొద్ది రోజుల క్రీతం నాటిన ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను నిశితంగా పరిశీలించారు. కాలనీలో పాదయాత్ర చేపట్టి... గాలి, వానకు వంగిపోయిన మొక్కలను గుర్తించి...ట్రీగార్డుతో సహా మొక్కలను సరిచేశారు. డివిజన్ లో ఎన్ని మొక్కలు బ్రతికాయి అన్న కోనంలో మేయర్ సునిల్ రావు...హరతహారంలో నాటిన ప్రతి మొక్కను నిశితంగా పరిశీలించారు. ఈ సంధర్బంగా మేయర్ సునిల్ రావు మాట్లాడుతూ... గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి శివారు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని తొలగిస్తున్నామన్నారు. వర్షాకాలంలో ఏయే ప్రాంతాల్లో నీరు బారీగా నిలుస్తున్నాయో ఆ ప్రాంతాలని అధికారులతో గుర్తంచి...వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వాటికి సంబందించిన అంచనాలను రూపొందించాలని...అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. వర్షకాలం ముగిసిన తర్వత ఆ ప్రాంతాలకు సంబందించిన డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచి...నీరు నిలవకుండ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ లేని చోట వాటికి ప్రణాళికలు రూపొందించి... వచ్చే వర్షకాలంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండ చూస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పేరేటర్ ఐలేంధర్ యాదవ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Related Posts