YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం విదేశీయం

కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది గుడ్ న్యూస్ చెప్పేసిన రష్యా

కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది  గుడ్ న్యూస్ చెప్పేసిన రష్యా

మాస్కో, ఆగస్టు 11
కరోనా వైరస్‌కు చెక్ పెట్టడానికి తొలి వ్యాక్సిన్ వచ్చేసింది. రష్యా కీలక ప్రకటన చేసింది. తొలి వ్యాక్సిన్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. అంతేకాదు, ఆ తొలి టీకాను తన కుమార్తెకు ఇచ్చినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం  ప్రకటించారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన తొలి దేశంగా రష్యా అవతరించింది. టీకా సమర్థంగా పనిచేస్తోందని.. రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తోందని పుతిన్‌ తెలిపారు.కరోనా యోధులకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పుతిన్ తెలిపారు. వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు చెప్పారు. రష్యాకు చెందిన గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌లో రెండు వేర్వేరుగా ఇంజెక్ట్‌ చేసే పదర్థాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి శరీరంలో రోగనిరోధక శక్తిని తయారు చేస్తాయి.ఈ టీకా అభివృద్ధిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రపంచం కోసం వేసిన అత్యంత కీలకమైన ముందడుగు ఇది. భవిష్యత్తులో ఈ వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో మనమే ఉత్పత్తి చేయగలుగుతామని ఆశిస్తున్నాను. ఇది చాలా ముఖ్యం కూడా’ అని పుతిన్ పేర్కొన్నారు.‘ఆమె (పుతిన్‌ కుమార్తె) కూడా ఈ టీకా ప్రయోగాల్లో భాగమయ్యారు. తొలిసారి ఆమెపై టీకాను ప్రయోగించాక శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరింది. తర్వాతి రోజు 37 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. రెండో టీకా తర్వాత కూడా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగి.. తర్వాత తగ్గింది. ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె శరీరంలో సమృద్ధిగా యాంటీబాడీలు ఉత్పత్రి అయ్యాయి’ అని పుతిన్ అన్నారు.రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను రెండు చోట్ల తయారు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్‌ మురాస్కో తెలిపారు. ది గమలేయా రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌, బిన్నోఫార్మా అనే కంపెనీలో తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ టీకాపై ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. విదేశాల్లో టీకా తయారీ అంశాన్ని ది రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) చూసుకుంటుందని స్పష్టం చేశారు.

Related Posts